ఎందుకొచ్చింది: పవన్-జేపీ-ఉండవల్లి కమిటీపై మహేష్ కత్తి సంచలనం, జగన్ అలా చేస్తే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీకి ఇచ్చిన నిధులపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నిధుల విషయంలో బీజేపీ అబద్దం చెబుతోందా, టీడీపీ అబద్దం చెబుతోందా అని తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

  Pawan Kalyan, Undavalli and JP Combo : Kathi Mahesh cheap comments

  చదవండి: జేసీకి బొత్స దిమ్మతిరిగే కౌంటర్, మేం సిద్ధం కానీ పవన్ కళ్యాణే తేల్చుకోవాలి

  పవన్‌కు కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని నిధుల లెక్క చెప్పమని అడిగే హక్కు ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. పవన్ అడుగులపై మహేష్ కత్తి మరోసారి ఘాటుగా స్పందించారు. నిత్యం పవన్‌ను విమర్శిస్తూ ఆయన ఇటీవలే హైప్ సాధించారు. ఆ తర్వాత చల్లబడ్డారు.

  చదవండి: జగన్! ఆ క్షణమే రాజీనామా చేస్తాం, బాబు అలిగితే: శివప్రసాద్, ఇక బాబు కీలక నిర్ణయం!

  పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీపై షాకింగ్ ట్వీట్

  పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీపై షాకింగ్ ట్వీట్

  మహేష్ కత్తి మళ్లీ జనసేనానిపై విరుచుకుపడుతున్నారు. జనసేనాని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఉద్దేశించి ఆయన సంచలన ట్వీట్ పెట్టారు. ఇది జస్ట్ ఫర్ ఫన్ కమిటీ (just for fun committee) అని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్.. జేపీ, ఉండవల్లి వంటి వారితో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

  పాచిపోయిన లడ్డూలకు నిజనిర్ధారక కమిటీయా

  పాచిపోయిన లడ్డూలకు నిజనిర్ధారక కమిటీయా

  పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తే మరో ట్వీట్ కూడా చేశారు. పాచిపోయిన లడ్డుల్ని పరీక్షించడానికి నిజనిర్ధారణ కమిటీ కావాల్సి వచ్చిందా పవన్ కళ్యాణ్ అని మహేష్ కత్తి ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ఇది ఎందుకు వచ్చింది

  ఇది ఎందుకు వచ్చింది

  'ప్రత్యేక హోదాపై నీ నిబద్ధత ఎక్కడ? JAC బదులు JFFC ఎందుకొచ్చింది?ఎన్ని మాటలు మారుస్తావు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎలా ఏమారుస్తావు?' అని మహేష్ కత్తి పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. అదే సమయంలో హోదా ఉద్యమంలో తమతో కలిసి రావాలని వైసీపీ చెప్పడంపై కూడా మహేష్ కత్తి స్పందించారు.

  జగన్‌కు మహేష్ కత్తి హితవు

  జగన్‌కు మహేష్ కత్తి హితవు

  వైసీపీ మార్చిలో చేసే ఉద్యమానికి అందరూ మద్దత్తు ఇవ్వాలంటే, ఇప్పటికే చలసాని శ్రీనివాస్ నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధన సమితి కార్యాచరణకి వైసీపీ కలిసి రావాలని, హోదా కోసం మోసం చేసిన అధికార పక్షాలు మినహా అందరూ కలిసి వస్తేనే ప్రజాఉద్యమం అవుతుందని పేర్కొన్నారు.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న ఏపీ

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న ఏపీ

  ఆంధ్రప్రదేశ్, ఏపీ ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారంటూ మహేష్ కత్తి ఓ ట్వీట్ పెట్టారు. ఈ మేరకు రెండు లారీ టైర్ల మధ్య ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పెట్టారు. ఇదిలా ఉండగా, అధికారికంగా ముఖ్యమంత్రుల్లో ధనవంతులైన చంద్రబాబుకు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mahesh Kathi said that Jana Sena chief Pawan Kalyan's JFC for just for fun committee.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి