మేడ్చల్‌లో పేలిన పెట్రోల్ ట్యాంకర్, ముగ్గురు మృతి: పెట్రోల్ దొంగిలిస్తుండగా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ తగలబడింది. పెట్రోల్ ట్యాంకర్‌తో పాటు ఆయిల్ ట్యాంకర్ కూడా తగలబడింది.

Major fire accident in medchal district

భారీ పేలుడుకు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పేలుడు కారణంగా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది.

Major fire accident in medchal district

భారీ పేలుడు, భారీ మంటలు, దట్టమైన పొగల కారణంగా ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకోలేకపోయాయి. కొందరు గాయపడినట్లుగా కూడా సమాచారం. కాగా, పెట్రోల్ కంపెనీ నుంచి ఆ ట్యాంకర్ బయటకు వచ్చాక పెట్రోల్ దొంగిలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Major fire accident in medchal district on Friday. Three dead in this accident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి