Hyderabad: మహీంద్ర కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరం మాదాపూర్‌‌లోని కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజిన్లతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

షారూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. షోరూం సమీపంలోని ఓ హోటల్‌కు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Major fire breaks out at Mahindra car showroom in Madhapur Hyderabad


ఇద్దరు కుమార్తెలను చంపి తల్లి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో విషాద చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపి ఆపై తాను కూడా ఉరి వేసుకుంది. చోరీ కేసులో ప్రేజా (35) భర్త షేక్ బాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అవమాన భారంతో ఇద్దరు కుమార్తెలు మెన్రూల్ (7), మెహక్ (6)లను చంపేసి ఆ తర్వాత ప్రేజా కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+