Hyderabad హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, రెండు బోట్లు దగ్ధం
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా హుస్సేన్ సాగర్‌లో బోట్లలో బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో హుస్సేన్‌లో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. కాగా, ప్రమాద సమయంలో ఈ రెండు బోట్లలో మొత్తం 15 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే, అగ్ని ప్రమాదం సంభవించడంతో వారంతా బోట్ల నుంచి దూకేయడంతో చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా, బోట్లలోని మంటలను సహాయక బృందాలు అదుపులోకి తీసుకొచ్చాయి. కాగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు.

భారత మాతకు మహా హారతి కార్యక్రమం ముగిసే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భరతమాత మహా హారతి కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, బీజేపీ ఎంపీలు, నేతలు, ప్రముఖ సినీ దర్శకుడు ఎంఎం కీరవాణి, నాగఫణి శర్మ తదితరులు హాజరయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని జనవరి 26న కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Two boats on fire in Hussain sagar of Hyderabad when celebs - fire crackers pic.twitter.com/LjXu9lnzSE
— Lokesh journo (@Lokeshpaila) January 26, 2025
అంతకుముందు గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాతకు మహా హారతి కార్యక్రమంలో చిన్నారులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో నగరవాసులు కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డితోపాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఇవాళ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో విద్యార్థుల కోలాహలం, జన సందోహం మధ్య, సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన భారతమాత మహా హారతి వేడుక.#BharathaMathaHarathi pic.twitter.com/N6tid0agyt
— G Kishan Reddy (@kishanreddybjp) January 26, 2025












Click it and Unblock the Notifications