Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూల్‌డ్రింక్‌లో మత్తు ఇచ్చి నాపై అఘాయిత్యం: జూ.ఆర్టిస్ట్‌పై మహిళా ఆర్టిస్ట్ చెప్పులతో దాడి

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే ఓ జూనియర్ ఆర్టిస్ట్‌పై మరో మహిళా జూనియర్ ఆర్టిస్ట్ సహా మరికొందరు మహిళలు దాడి చేశారు. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ సదరు మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఆ ఆర్టిస్టు శ్రీశాంత్ రెడ్డిపై వారు చెప్పులతో కూడా దాడి చేశారు. మొదట తన వెంట పడ్డాడని, ప్రేమించాలని బలవంతం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, కానీ ఇప్పుడు మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు.

Male Junior artist attacked by Woman Junior Artist

ఈ మేరకు ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని లొంగదీసుకున్నాడని చెప్పారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి, తనకు స్ప్రే కొట్టి తనపై అఘాయిత్యం చేశాడని వాపోయారు. ఇతని వల్ల నా తండ్రి చనిపోయాడన్నారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేశానన్నారు.

బాధిత జూనియర్ ఆర్టిస్ట్ వెంట మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు, ఇతర మహిళలు వచ్చారు. వారు శ్రీశాంత్ రెడ్డిపై చెప్పులతో దాడి చేశారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. శ్రీశాంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట జూనియర్ ఆర్టిస్టులు బైఠాయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+