కోర్టు సమీపంలో టెక్కీ బావ హత్య: నిందితుడు, సుపారీ గ్యాంగ్ అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌/మేడ్చల్: మల్కాజ్‌గిరి న్యాయస్థానం సమీపంలో డిసెంబర్ 22న జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చందర్‌ను అతడి బావమరిది వినయ్‌ సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు.

మల్కాజ్‌గిరి కోర్టు సమీపంలో ఘోరం: 'టెక్కీ' బావను నరికి చంపారు

ఈ కేసులో ప్రధాన నిందితుడైన వినయ్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్‌ చేశామని, మరో 11 మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు. చందర్‌ దంపతుల విడాకుల కేసు మల్కాజ్‌గిరి కోర్డులో నడుస్తుండగా.. తన అక్కను వేధిస్తున్నాడన్న కక్షతో వినయ్‌ తన తన బావ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు.

malkajgiri techie murder case: accused arrested

విచారణ నిమిత్తం 22న చందర్‌ కోర్టుకు వస్తాడని తెలుసుకున్న వినయ్‌.. కారెక్కుతున్న తన బావను పిలిచి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు. ఈ హత్య కేసులో మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Six accused arrested in malkajgiri techie murder case on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి