కేసీఆర్‌పై పైచేయి: రేవంత్ రెడ్డిపై కేసు, సీఎంకు షాకింగ్ డిమాండ్లు

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మల్లన్న సాగర్ దీక్షకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందింది. ఐపీసీ 504, 209, 188, 21/76 తదితర సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదు చేశారు.

కాగా, మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించాలంటే ప్రభుత్వ తరఫున నీటి పారుదల సాఖ మంత్రి హరీష్ రావు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి శనివారం నాడు డిమాండ్ చేశారు. మత్రితో పాటు అదికారులు వస్తే ప్రజల తరఫున తాము వచ్చి జీవో 123తో పాటు భూ సేకరణ చట్టంపై వాస్తవాలను చర్చిస్తామన్నారు.

బలవంతంగా భూ ములు సేకరించకుండా ప్రజల మనసులు గెలుచుకొని ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. మల్లన్న సాగర్ జలాశయం కారణంగా ముంపుకు గురయ్యే వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని రెండు రోజుల పాటు రేవంత్ దీక్ష చేపడతానని చెప్పిన విషయం తెలిసిందే.

 Mallannasagar, hikes a boon for Congress, TDP

ఆయన మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో శనివారం దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముంపు బాధితులకు న్యాయం చేసే విషయంలో కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. పదిహేను రోజుల్లోగా ప్రభుత్వం సరైన స్పందన రాకుంటే కేసీఆర్ పాంహౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

కేసీఆరే ఆంధ్రావాళ్లతో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. చండీయాగానికి చంద్రబాబు, వెంకయ్యను పిలిచారని, ఇలా అందరూ ఆంధ్రావాళ్లనే కేసీఆర్ పిలిచారని, తెలంగాణ కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పిలవలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అడ్డుపడ్డవాళ్లే ఆయనకు ఆత్మీయులయ్యారన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన రెఫరెండం పెట్టాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ పలు డిమాండ్లు చేశారు.

2013 పునరావాస చట్టం ప్రకారం మల్లన్న సాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, భూమి విలువలో మార్కెట్ రేటుకు దళితులక నాలుగింతలు, ఇతరులకు మూడింతల చొప్పున పరిహారం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమిని ప్రాజెక్టు కింద కేటాయించాలని, కులవృత్తుల వారికి రెండేళ్ల పాటు ప్రతి కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలని, గ్రామ సభలో 70 శాతం ప్రజల తీర్మానం అమలు చేయాలని, నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయకుంటే గ్రామస్థులకు వారి భూములు వారికి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్లు పెట్టారు.

ఇదిలా ఉండగా, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ భూసమీకరణలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూమిని సేకరించడానికి ప్రస్తుతం రెండు విధానాలు అమలులో ఉన్నాయన్నారు.

2013లో తెచ్చిన భూసేకరణ చట్టం ఒకటి కాగా, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీఓ 123 మరొకటని సీఎం చెప్పారు. రైతులు జీఓ నెం 123 ప్రకారం కావాలంటే ఆ విధానం ద్వారా, 2013 చట్టం ద్వారా పరిహారం కావాలనుకొనేవారికి అదే నిబంధన ప్రకారం పరిహారం ఇస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+