వారి మధ్య చీకటి ఒప్పందం: కేసీఆర్, మోడీపై మల్లిఖార్జున ఖర్గే తీవ్ర విమర్శలు
నల్గొండ: దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటించారు. ఆలంపూర్, నల్గొండలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ఖర్గే. యావత్ రాష్ట్ర ప్రజలు ఏకమై అహంకార ధోరణితో ఉన్న కేసీఆర్‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
మోడీ, కేసీఆర్ ఇద్దరికి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయన్నారు ఖర్గే. మోడీ, కేసీఆర్‌కు పేద ప్రజల కష్టాలు తెలియదన్నారు. పేద ప్రజల కోసం ఇందిరా గాంధీ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఖర్గే తెలిపారు. ఇందిరమ్మ వంటి మహా నాయకురాలను కూడా కేసీఆర్ దూసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ గొప్ప ప్రాజెక్టును ఇందిరాగాంధీ హయాంలోనే కట్టించారన్నారు. సాగర్ కట్టకపోతే తెలంగాణ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ అవినీతి మయంగా మార్చన్నారని ఖర్గే మండిపడ్డారు. ధనికులైనా, పేదలైనా.. వెనుకబడిన వర్గాలైనా, దళితులైనా ఎవరు కూడా ఆకలి కడుపుతో చనిపోవద్దని ఇందిరాగాంధీ.. గరీబీ హఠావో కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. కానీ, కేసీఆర్ ఆమె గురించి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఇందిరా గాంధీ ఎక్కడ.. కేసీఆర్ ఎక్కడ. డబ్బు కోసమే కేసీఆర్ పాలన చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయారు. హైదరాబాద్‌ను వదిలి ఫామ్‌హౌస్ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఈ వ్యక్తి మీకు కావాలా? మరోసారి కేసీఆర్ అధికారంలో కొనసాగాలని మీరు అనుకుంటున్నారా? అని ప్రజలను మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. మరోవైపు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారని నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను బంద్ చేశారని ఆరోపించారు. నల్గొండలో 2కి 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఖర్గే.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications