రేవంత్ సర్కారుపై ఖర్గే ప్రశంసలు: మోడీ సీబీఐ, ఈడీల దాడులంటూ అలర్ట్

హైదరాబాద్: లోక్‌సభ తెలంగాణ కాంగ్రెస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun kharge). బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బూత్ ఏజెంట్ల బాధ్యత చాలా ఉంది. అత్యంత కీలకమైన పని ఉంది. మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చాము. అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేసాము. మనం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు.

Mallikarjun Kharge hits out at pm modi in hyderabad congress booth level meeting

మోడీ గతంలో 'మోడీ గ్యారంటీ' అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏం అయింది.రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మోడీ ఇచ్చిన అన్ని హామీలపై ప్రశ్నిస్తాం. దేశంలో రైతులకు పనులు లేవు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా? వారి కడుపు ఎలా నిండుతుంది. దేశంలో యువత ఉన్నారు వారికి ఉపాధి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని ఖర్గే పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి భారత్ న్యాయ యాత్ర ప్రారంభించారు. దిగ్విజయంగా సాగిస్తున్నారు. ప్రజలంతా బాగుండాలని యాత్ర చేస్తున్నారు. ప్రజలకు న్యాయం కోసం యాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ.. యువత, మహిళ, దళిత, గిరిజన ప్రజల కోసం కష్ట పడుతున్నారు. మీరందరూ కష్టపడి, రాహుల్ గాంధీ కృషి వల్ల రాష్ట్రంలో అధికారంలో కి వచ్చాము. ఇక్కడ మీరంతా కష్టపడి ఎలాంటి ఫలితాలు తెచ్చారో.. దేశంలో కూడా అలాంటి ఫలితాలు తేవాలి అని ఖర్గే పిలుపునిచ్చారు.

తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉందని మల్లిఖార్జున ఖర్గే ప్రశంసించారు. మోడీ, అమిత్ షాలు.. ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు పడగొడుతారు. కానీ, తెలంగాణాలో గతంలో ఉన్న కాంగ్రెస్ లేదు.. చాలా పటిష్టమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉంది. మోడీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి దాడులు చేసి అవకాశం ఉందన్నారు ఖర్గే.


సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ, బీజేపీకి తెలంగాణలో ఎవరు భయపడరు. కేసీఆర్ ఏప్ప్పుడు బీజేపీపై ఆరోపణలు చేయలేదు. బీజేపీ, బిఆర్ఎస్ లను కాంగ్రెస్ ఇక్కడ ఓడించింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

మనం ఎప్పుడు క్షేత్ర స్థాయిలో పనులు చేస్తే విజయం సాధిస్తాం. నెహ్రు ఒకసారి అన్నారు మనం ప్రజల మధ్య ఉంటే గెలుస్తాం.. లేకపోతే ఓడిపోతాం. అందుకే మనం గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో పని చేయాలి. మీ శక్తి అంత గ్రామ స్థాయి, బూత్ స్థాయిలో పని చేసి రాబోయే ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పని చేసి విజయం సాధించాలి. మోడీ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్నాం అంటూ బలహీన పరుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. మణిపూర్ అగ్నిగుండంలా మారితే ప్రధాని మోడీ అక్కడికి ఒక్కసారిగా కూడా వెళ్లలేదని విమర్శించారు.


మోడీకి రైతుల బాధలు, కష్టాలు తెలియవన్నారు ఖర్గే. సమస్యలను పక్కదారి పట్టిస్తారని ఆరోపించారు. పాకిస్థాన్, చైనా, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని.. అందుకే బీఆర్ఎస్, బీజేపీని ఓడించామన్నారు ఖర్గే. ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలి.. ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి.. కానీ మోడీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారం తోనే కాలం గడుపుతున్నారు.. ప్రజల సొమ్ముతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఖర్గే విమర్శించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+