బీజేపీ పోటీలో లేదు.. బీఆర్ఎస్‌తో కలిసి..: కేసీఆర్, మోడీపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కుత్బుల్లాపూర్‍లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లిఖార్జున ఖర్గే పొల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు మల్లిఖార్జున ఖర్గే. తెలంగాణలో బీజేపీ పోటీలో లేకుండా పోయిందన్నారు. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌కు సహకరించేందుకే బీజేపీ పోటీ నుంచి వైదొలిగిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే తెలంగాణలో పోటీ చేస్తున్నాయని, వాటి మధ్య రహస్య ఒప్పందం ఉందని మల్లిఖార్జున ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ.. బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చూస్తుందని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. అవి ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదన్నారు. అందరి భవిష్యత్ ను రాసే గొప్ప బాధ్యతను అంబేద్కర్ ఆనాడు నెహ్రూకు అప్పగించారని చెప్పారు. ప్రజలందరి పోరాటం చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని మల్లిఖార్జున వివరించారు.
ఒక్క కుటుంబం కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారని.. కానీ, అవి నెరవేరలేదన్నారు మల్లిఖార్జున ఖర్గే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రధాని మోడీకి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఓడిపోదని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.

కేసీఆర్ చేసిందేమీ లేదు: రేవంత్
ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలదేనని అన్నారు. నేను ఈ స్థాయికి చేరడంతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ దాగుంది. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని రేవంత్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తుండు.. తెలంగాణలో నాగార్జున సాగర్, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని రేవంత్ వ్యాఖ్యానించారు. కనిపించే ఈ వెలుగు జిలుగులు కాంగ్రెస్ వల్లే... చింతమడకలో కేసీఆర్ చదివిన బడి కూడా కాంగ్రెస్ కట్టిందేనన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్. బెంగాలీలు, ఒడిశా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వాళ్లకు ఉపాధి కలుగుతుందంటే అది కాంగ్రెస్ కృషివల్లేనని అన్నారు రేవంత్. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప మోడీ, కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారు. కేసీఆర్ పాలనలో 8వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 83 వేల మంది రైతులు చనిపోయారు. కేసీఆర్ లోపభూయిష్ట విధాలతో అవినీతి పెరిగింది. లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని రేవంత్ ఆరోపించారు. మేడిగడ్డ కేసీఆర్ అవినీతికి, దోపిడీకి బలైందని విమర్శించారు.
'త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయింది. నిన్న కర్ణాటక గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. నేడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుంది.2024లో ఖర్గే నేతృత్వంలో ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం.ఈ ఎన్నికలు కేసీఆర్‌ను ఉంచాలా? కేసీఆర్‌ను దించాలా అని జరుగుతున్న ఎన్నికలు. బరాబర్ కేసీఆర్‌ను దించుడే.. దంచుడే అని ప్రజలు అంటున్నారు.
కుత్బుల్లాపూర్‌లో కొలను హన్మంతరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ కోరారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications