Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రజలకు కీలక హామీలు: కేసీఆర్, మోడీపై విరుచుకుపడ్డ మల్లిఖార్జున ఖర్గే

సంగారెడ్డి: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేశారు.

గతంలో కాంగ్రెస్​ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని.. ఇప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తుందని మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని.. తొమ్మిదేళ్ల కేసీఆర్​ పాలనలో అప్పులపాలు అయిందన్నారు. బీఆర్​ఎస్​ చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పుల వల్ల ప్రతి ఒక్కరిపై రూ. 1.50 లక్షల అప్పు పెట్టారన్నారు. హైదరాబాద్‌​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని చెప్పుకొచ్చారు.

Mallikarjun Kharge slams PM Modi and CM KCR in Congress Public Meeting at Sangareddy

కాంగ్రెస్​ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయన్నారు మల్లిఖార్జున ఖర్గే. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని మాటిచ్చారు. మహిళలకు ప్రతి నెల వారి ఖాతాల్లో రూ.2500 వేస్తామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ. 500 బోనస్​ ఇస్తామన్నారు. విద్యార్థులకు యువ వికాసం కింద చదువులు కోసం రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీపైనా మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.
మోడీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని.. ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయిందన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్‌​కు బీటీం ఎవరో ప్రజలందరికీ తెలుసున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని మండిపడ్డారు.

ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోడీ గొప్పగా చెప్పుకున్నారని ఆరోపించారు. కేసీఆర్​, మోడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అధికారంలోకి రాగానే కేసీఆర్​, మోడీ ఇచ్చిన హామీలు మరిచిపోయారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు మల్లిఖార్జున ఖర్గే. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, అభ్యర్థి జగ్గారెడ్డి పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+