మెగాస్టార్ చిరంజీవి ఈ సాహసం చేస్తారా?

హైదరాబాద్: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై రాజకీయ జీవితంపై మమ్ముట్టితో యాత్ర సినిమాను తీసిన దర్శకుడు మహి వీ రాఘవ్.. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

పుట్టినరోజును పురస్కరించుకుని మమ్ముట్టి నటించబోతోన్న తాజా చిత్రం భ్రమయుగం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రం యూనిట్. ది ఏజ్ ఆఫ్ మ్యాడ్‌నెస్ అనేది దీని క్యాప్షన్. నైట్ షిఫ్ట్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. రాహుల్ సదాశివన్ దర్శకుడు. చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మాతలుగా వ్యహరిస్తోన్నారు.

Mammootty

భ్రమయుగం ఫస్ట్‌లుక్‌లో సూపర్ స్టార్ మమ్ముట్టి కంప్లీట్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్‌లో విడుదల చేసిన పిక్ ఇది. ఓ కుర్చీలో కూర్చుని మ్యాడ్‌గా నవ్వుతూ కనిపించే ఫొటో ఇది. మాసిక గెడ్డం, గారపట్టిన పల్లు, మెడలో ఓ రుద్రాక్ష మాల, టాప్ లెస్‌గా కనిపించారు మమ్ముట్టి.

మాలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది. మమ్ముట్టి గెటప్ చూస్తోంటే.. మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమైనట్టే అనిపిస్తోంది. కాంతారా తరహా సినిమా కావొచ్చనే అంచనాలు మాలీవుడ్‌లో వ్యక్తమౌతోన్నాయి. 72 సంవత్సరాల వయస్సులో ఓ సూపర్ స్టార్ ఇలాంటి సినిమాను తీస్తోన్నారంటే నమ్మశక్యం కావట్లేదంటూ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

Mammootty

ఈ మూవీ ఏ మాత్రం హిట్ అయినా.. తెలుగు సినిమా పెద్దల కన్ను దీని మీద పడినట్టే. అసలే రీమేక్‌లో కాలం గడుపుతోన్న స్టార్ హీరోలు ఈ సినిమాను ఖచ్చితంగా రీమేక్ చేసి తీరుతారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదే అభిప్రాయాన్ని పలువురు నెటిజన్లు బాహటంగా తెలియజేస్తోన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఇది సూట్ అవుతుందనీ అంచనా వేస్తోన్నారు.

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను చిరంజీవి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ నటించిన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను గాడ్ ఫాదర్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు. అదే తరహాలో భ్రమయుగం కూడా రీమేక్ అవ్వొచ్చనే ప్రచారం అప్పుడే మొదలైంది కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+