ఉద్యోగాలిప్పిస్తామని మోసం: కటకటాలు లెక్కిస్తున్న బాషా (ఫొటో)
హైదరాబాద్: ఉద్యోగాల కోసం యువత మోసగాళ్ల బారిన పడడం సర్వసాధారణంగా మారింది. తాజాగా, ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి ఓ వ్యక్తి లక్షల్లో రూపాయలు వసూలు చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
ఈ సంఘటన హైదరాబాదులోని చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ గురు రాఘవేంద్ర ఆ వివరాలను అందించారు. సికిందరాబాద్ అల్వాల్‌లోని సిటిజెన్‌కాలనీలో నివసించే షేక్ మహబూబ్‌బాషా అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అశోక్‌రెడ్డి(53) వ్యాపారి.

కొత్తపేట సమీపంలోని మోహన్‌నగర్‌లో రాయల్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. వరుణ్‌ను భాగస్వామిగా, జంగయ్య, వెంకటేశ్వర్‌రావు, యాదయ్య, వెంకట్, భానులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి దాదాపు రూ.90 లక్షలు వసూలుచేశాడు.
నకిలీ నియామకపత్రాలు, ఐడెంటీ కార్డులు సృష్టించి నిరుద్యోగులను ముంచేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్‌చేసి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications