నవ వధువుపై హత్యాయత్నం: భర్త అరెస్టు (ఫొటోలు)

హైదరాబాద్: ఓ వ్యక్తి పెళ్లయిన మొదటి రోజు నుంచి భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. బ్యాంక్ అధికారి అయిన అతను భార్యకు నిత్యం నరకం చూపిస్తూ వచ్చాడు. తలను గోడకేసి కొట్టి ఆమెపై హత్యాప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఖమ్మం జిల్లా గార్ల గ్రామానికి చెందిన రత్నానికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు కల్యాణి ఇటీవల ఎంబిబిఎస్ పూర్తి చేసింది. ఈ ఏడాది మే 29వ తేదీన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో నివాసం ఉంటున్న ఐడిబిఐ బ్యాంక్ ఉద్యోగి అనిల్ కుమార్ గంగావత్‌తో ఆమె వివాహం జరిగింది.

Man attempt to kill wife in Hyderabad

పెళ్లి జరిగిన మర్నాటి నుంచే వేధించడం ప్రారంభించాడు. తనకు కోటి రూపాయల కట్నం ఇ్చచే వారున్నారని, అయినా తండ్రి మాట కాదనలేక వివాహం చేసుకున్నానని అతను నిత్యం కల్యాణిని వేధిస్తూ వచ్చాడు. ఎంబిబిఎస్ చదివిన కల్యాణి వేధింపుల కారణంగా ఎండి చదివే అవకాశం వచ్చినా వదులుకుంది. శారీరకంగా హింసించాడు.

ఆషాఢ మాసం కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత కూడా భర్త దగ్గరకు రావడానికి నిరాకరించింది. పెద్దలు ఒప్పించడంతో తండ్రి, చెల్లి, సోదరులతో కలిసి భర్త వద్దకు వచ్చింది. వారందరూ హాల్లో కూర్చుని ఉండగానే భార్యాభర్తలిద్దరూ బెడ్రూంలో గొడవ పడ్డారు. అనిల్ కుమార్ ఆగ్రహంతో ఆమె జడ పట్టుకుని తలను గోడకేసి బాదాడు.

Man attempt to kill wife in Hyderabad

ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమను ఆపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసియూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కల్యాణి సోదరి ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అనిల్ కుమార్ గంగావత్‍ను అరెస్టు చేశారు. వివాహ సమయంలో అతనికి 8 లక్షల రూపాయల కట్నం, 16 తులాల బంగారం ఆభరణాలు ఇచ్చినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదులో ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+