మాట్లాడాలి రమ్మని మరదలిని అక్కడికి పిలిచి: నమ్మినందుకు ఎంత పనిచేశాడంటే?

యువతి మరొకరితో చనువుగా ఉండటం నచ్చకే హత్య చేసినట్లు తెలుస్తోంది.

్హైదరాబాద్: బోరబండ పర్వత్‌నగర్‌కు చెందిన ఓ డ్రైవర్‌ తన మరదలిని చంపేశానంటూ వచ్చి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోవడం కలకలం రేపింది. అతను చెప్పిన ప్రదేశంలో యువతి మృతదేహం ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఘటనపై అనుమానాలు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. బోరబండ పర్వత్‌నగర్‌లో నివాసముండే యువకుడి కృష్ణయ్యకి, చింతల్‌లో తనకు మరదలు వరుసయ్యే సౌమ్యతో వివాహం నిశ్చయమైంది. యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. యువతి చింతల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఈ క్రమంలో యువతి మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడటాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు.

man charged over the murder of her fiancee

ఇదే విషయం మాట్లాడటానికి యువతిని హెచ్‌ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు. యువతితో మాట్లాడుతున్న సమయంలోనే.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.

అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి తీసుకెళ్లి.. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువులో పడవేశాడు. అక్కడి నుంచి పర్వత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. అప్పటికే చీకటి పడటంతో పోలీసులు శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీసే అవకాశముంది.

ఒప్పుకున్న కృష్ణయ్య:

పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు కృష్ణయ్య.. సౌమ్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇతరులతో చనువుగా ఉండటం చూడలేకే హత్య చేసినట్లు తెలిపాడు. సౌమ్యతో కృష్ణయ్య వివాహ నిశ్చితార్థం అయినట్టు వస్తున్న కథనాలను పోలీసులు ఖండించారు.అందులో నిజం లేదని తెలిపారు.

సౌమ్య ఛాతి భాగంలో బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో మరో కోణమేమైనా ఉందా? అని కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం జీడిమెట్ల పోలీసుల అదుపులో ఉన్న కృష్ణయ్య నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+