వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఆర్డర్లో రెండుమూడుసార్లు.. ఒరిజినల్ తీసి డూప్లికేట్: ఫ్లిప్‌కార్ట్‌కు టోకరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ - కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలను మోసగిస్తున్న వీరస్వామి అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు. ఆన్ లైన్ ద్వారా వస్తువులను ఆర్డర్ చేసి.. అవి వచ్చాక వాటిలోని విలువైన చిప్ తదితరాలను తీసుకొని, తిరిగి పంపిస్తుంటాడు.

ఈ విషయాన్ని గుర్తించిన సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో, పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటి వరకు దాదాపు రూ.50 లక్షల మేర మోసం చేశాడు. ఆర్డర్ చేసిన వస్తువుల నుంచి అసలువి తీసుకొని... నకిలీవి ప్యాక్ చేసి పంపిస్తుంటాడు.

Man cheats online shopping website Flipkart

నిందితుడు వనస్థలిపురంకు చెందిన వ్యక్తి. అతను వస్తువులను ఆర్డర్ చేస్తాడు. అవి వచ్చాక.. వాటిలోని విలువైన చిప్ తదితరాలను తీసుకుంటాడు. అనంతరం మల్లీ ఈ కామెర్స్ సంస్థలకు ఫోన్ చేసి.. తనకు సరైన వస్తువులు రాలేదని చెబుతాడు.

Man cheats online shopping website Flipkart

దీంతో వారు, వాటిని పంపించాలని చెబుతారు. కంపెనీలు మళ్లీ అసలువి పంపిస్తారు. అతను మళ్లీ ఇలాగే చేస్తాడు. ఒకే ఆర్డర్ పైన రెండుమూడుసార్లు కంపెనీలను మోసం చేస్తుంటాడు. ఇతను పదో తరగతి వరకు చదువుకున్నాడు.

Man cheats online shopping website Flipkart

వయస్సు 25 ఏళ్లు. రిపేరింగ్ వర్క్ చేస్తుంటాడు. డెలివరీ బాయ్స్‌కు కూడా టెక్నికల్ నాలెడ్జ్ అంతగా ఉండదు. దీనిని అతను ఉపయోగించుకొని కంపెనీలను మోసం చేస్తుంటాడు. ఒకే ఆర్డర్లో రెండుమూడుసార్లు ఇలాగే చేస్తాడు.

ఫ్యాన్ ఊడిపడి చిన్నారికి గాయాలు

నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆస్పత్రిలోని ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి కిందకు పడిపోయింది. దీంతో ఆ గదిలో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
A young engineer has been booked under a cheating case. He has been accused of duping Flipkart of Rs 50 lakh. The incident took place in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X