ఉరి వేసుకొన వ్యక్తి ఆత్మహత్య: భర్త వేధింపులు తాళలేక భార్య బలవన్మరణం

వరంగల్: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకాపురం మండల కేంద్రంలోని బెస్తగూడెం గ్రామంలో ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకన్న సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన రామెళ్ల నరేష్‌ (28) మద్యం తాగి తరచూ కటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మూడుసార్లు ఉరి వేసుకునేందుకు యత్నించగా గమనించిన గ్రామస్తులు కాపాడారు.

గురువారం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవ పడి రాత్రి 11 గంటల సమయంలో భార్య చున్నీతో ఇంో్లని దూలానికి ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి కిందికి దించేలోగా మృతిచెందాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు పిల్లలు ఉన్నాఉ. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండారి కుమార్‌ తెలిపారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఏడాది కాలంగా వేధింపులకు గురిచేస్తుండటంతో భరించలేక పురుగుల మంది గారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని లక్ష్మీనర్సాపుంలో జరిగింది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.... మండలంలోని రామచంద్రునిపేట పచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురానికి చెందిన మండకం రామకృష్ణ భద్రాద్రి జిల్లా కత్తిగూడెం గ్రామానికి చెందిన వడ లక్ష్మయ్య కూతురు స్రవంతిని 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Man commits suicide in Jayashankar Bhupalapalli district

ఏడాది కాలంగా తరుచుగా మానసికంగా వేధిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త పెట్టే బాధలు తాళలేక గురువారం ఉదయం 10 గంటల సమయంలో పురుగులమందు తాగింది. వెంటనే ఆమెను ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మధ్యాహ్నం 12 గంటలకు మృతిచెందింది. మృతురాలి తండ్రి వడ లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+