'ఆమె' కోసం విదేశాల్లో జాబ్ వదిలేశా: ప్రియురాలి కోసం ప్రియుడు పీఎస్‌లో ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుందామని అనుకున్నామని, ఆమె కోసం తాను విదేశాల్లో ఉద్యోగం కూడా వదిలేసుకున్నానని కానీ తీరా ఇప్పుడు తనను వద్దని అంటోందని ఓ యువకుడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విదేశాల్లో ఉద్యోగం వదులుకున్నా

విదేశాల్లో ఉద్యోగం వదులుకున్నా

ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తన ప్రియురాలిపై అతను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం విదేశీ ఉద్యోగాన్ని కూడా వదులుకున్న తన పరిస్థితి ఏమిటని అడుగుతున్నాడు.

పెళ్లికి అంగీకారం

పెళ్లికి అంగీకారం

ఫిలింనగర్ దుర్గాభవానీ నగర్‌లో ఉంటున్న ఎలక్ట్రీషియన్ 24 ఏళ్ల మహేష్ రెండేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్న ఇరవై రెండేళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు.

విస్తుపోయిన మహేష్

విస్తుపోయిన మహేష్

అయితే ఏమైందో కానీ ఇప్పుడు ఆమె తాను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పింది. దీంతో విస్తుపోవడం మహేష్ వంతయింది. బతిమాలినా ఆమె అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించాడు.

 ఆమె కోసం త్యాగాలు చేశా

ఆమె కోసం త్యాగాలు చేశా

ఆమె కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని, విదేశాల్లో ఉద్యోగం వస్తే కూడా వదిలేశానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం జరగకుంటే కోర్టుకు వెళ్తానని చెప్పాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మనం ప్రియుడు లేదా భర్త మోసం చేస్తే వారిపై పోరాటం చేసే వారిని ఎక్కువగా వింటుంటాం. కానీ ఇక్కడ రివర్స్ అయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Man complaint against his lover in Hyderabad over marriage. He alleged that that he left foreign job for her but now she is rejecting me.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి