లోదుస్తుల్లో 2 కిలోల బంగారం, ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం నాడు బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన ఆయూబ్ అనే ప్రయాణీకుడు లోదుస్తుల్లో బంగారం బిస్కెట్లు తీసుకు వస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డాడు.

అతని వద్ద నుండి సుమారు రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని పైన కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతను తన లోదుస్తుల్లో దాచి తీసుకు వచ్చిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

బావిలోపడి బాలురు మృతి

Man conceals 2kg gold in garments, gets arrested

ఆదిలాబాద్‌ జిల్లా కాశిపేట మండలం ధర్మారావుపేటలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు బాలురు శుక్రవారం ఓ బావిలో విగతజీవులుగా కనిపించారు. చిన్నారులు అజయ్‌, సంతోష్ రెండురోజుల నుంచి కనిపించడం లేదు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో బాలురు బావిలో శవాలుగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ వివాక వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన పిల్లలు అదృశ్యమయై.. ఈరోజు విగతజీవులుగా కనిపించారు.

కానిస్టేబుల్ అరెస్ట్

సీసీఎస్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. ఎస్సై పోస్టులు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు గుంజిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+