పారిపోయి మొదటి భార్యకు అడ్డంగా దొరికాడు: రెండో భార్యకు బిడ్డ (ఫొటో)
హైదరాబాద్: భార్య ఉండగానే మరో యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అపరి కళ్యాణ్ అదే ప్రాంతానికి చెందిన దుర్గాదేవితో 2010లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.
దుర్గాదేవి తల్లిదండ్రులు మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో నివసిస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కళ్యాణ్ భార్యతో కలిసి మాదాపూర్ వచ్చాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బు తీసుకొని కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి దుర్గాదేవి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

కళ్యాణ్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడివద్ద రోడ్డుపై మంగళవారం నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని గుర్తించిన దుర్గాదేవి తల్లిదండ్రులకు సమా చారం ఇచ్చింది.ఆమె బంధువులు అతడిని పట్టుకొని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

సంవత్సరం క్రితం మొదటి భార్యకు కనిపించకుండా పోయి విశాఖపట్నంలో ఉంటున్న కళ్యాణ్ అపర్ణ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఒక కుమారుడు. ఇద్దరు భార్యలూ పోలీసులను ఆశ్రయించారు. భార్య ఉండగానే మరో యువతిని పెళ్లి చేసుకు న్నందుకు అతడిపై 420, 498ఎ, 494సెక్షన్లతోపాటు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications