"సహజీవనం చేయడానికి మహిళే కావాలా ఏంటి..?"

కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని వదిలేశాడు. ఆమె మాయలో పడిపోయాడు. భార్య ఆస్పత్రిలో ఉన్నా అతడి హృదయం మాత్రం ఆమె కోసమే పరితపించింది. కన్న బిడ్డలు రోదిస్తున్నా వాళ్లను గాలికొదిలేసి ఆమెతోనే అన్నీ అనుకుని కొత్త కాపురం పెట్టాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు వద్దని వారించినా ఆమె చేయి వదల్లేదు. ఇంతకీ ఆమె ఎవరు అని అనుకుంటున్నారా..? ఆమె ఆడ కాదు.. మగ కాదు.. ఆమె ఒక ట్రాన్స్ జెండర్. అవును.. ఓ హిజ్రా మాయలో పడిపోయిన ఆ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. మనస్తాపానికి గురైన భార్య ఆస్పత్రిలో ఉన్నా అతడు మాత్రం పట్టించుకోలేదు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది.

అతనికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. అయినా కుటుంబాన్ని వదిలేసి ఓ ట్రాన్స్ జెండర్ తో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య.. సూసైడ్ కు ప్రయత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబీకులు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ట్రాన్స్ జెండర్ తో ఆ వ్యక్తి ఉన్న సమయంలో బయట నుంచి ఇంటికి తాళం వేశారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇచ్చారు.

అసలు విషయం ఏంటంటే.. జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యకు 2014లో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బింగి రాజశేఖర్‌ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో రాజశేఖర్ కు హైదరాబాద్‌ కు చెందిన ట్రాన్స్ జెండర్‌ దీపుతో పరిచయం ఏర్పడింది.. దీంతో దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి, దీపుతో హైదరాబాద్ లో సహజీవనం ప్రారంభించాడు రాజశేఖర్.

ఈ విషయం లాస్యకు తెలిసింది. మనస్తాపానికి గురైంది. తన భర్త రాజశేఖర్.. దీపుతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నా రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు.

Man in Jagityal Starts New Life with Transgender Partner Leaving Family Behind

ఈ క్రమంలో జగిత్యాలతో అతని ఇంట్లోనే దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంటి బయట నుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+