హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం ..
వేములవాడ : వారిద్దరూ ప్రేమించుకున్నారు .. కొన్నాళ్లు కలిసే ఉన్నారు. అయితే పెద్దలు పిలిపించడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకొని ఉన్నారు. కానీ ఆ పాత లవర్స్ మళ్లీ కలిశారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. కట్ చేస్తే యువకుడిని వివాహిత భర్త మట్టుబెట్టాడు. ప్రస్తుతం వివాహిత భర్త, కిరాయి హంతకులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ప్రేమ అని ..
సిరిసిల్ల జిల్లా వేములవాడ సుబ్రహ్మణ్యం వీధికి చెందిన నాగుల రవి .. కొన్నేళ్ల క్రితం యువతిని ప్రేమించాడు. తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ వారు ఇటీవల మళ్లీ కలువడం .. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం ఆ వివాహిత భర్తకు తెలిసి రగిలిపోయాడు. కిరాయి హంతకుల సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం రవిని మాటు వేసి మట్టుబెట్టారు.

వేములవాడలోనే ...
రవి స్వస్థలం సిద్దిపేట. కానీ 20 ఏళ్ల క్రితం వేములవాడ వచ్చి ఇక్కడే స్ధిరపడ్డారు. అయితే తన పాత ప్రేయసితో వివాహేతర సంబంధం అతని ప్రాణం తీసింది. రవి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే వివాహిత భర్త, కిరాయి హంతకులు పరారీలో ఉన్నారు. దీంతో వారే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications