చంపేసి శవానికి కొత్త దుస్తులు తొడిగారు (ఫొటో)
హైదరాబాద్: హైదరాబాదులోని ఎన్టీఆర్ నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్టీఆర్ నగర్‌లో గౌరి, మరదలు అనితతో కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. వీరిద్దరు కూడా స్థానికంగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తార్నాకాలో నివాసం ఉంటన్న శ్యామ్ (35) డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు.
శ్యామ్‌కు భార్య, ఇద్రదు పిల్లలు ఉన్నారు. వారికి దూరంగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్యామ్‌కు గౌరితో పరిచయమైంది. అప్పుడప్పుడు ఆమె నివాసం ఉంటున్న గదికి వచ్చి వెళ్తుండేవాడు. అదే కాలనీలో ఉంటున్న రవి కూడా అనిత కోసం అప్పుడప్పుడు గదికి వచ్చేవాడు.

రెండు రోజుల క్రితం గౌరి, అనితతో పాటు రవి గదిలో ఉండగా, శ్యామ్ అక్కడికి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రవి పదునైన ఆయుధంతో శ్మామ్ తలపై బలంగా కొట్టాడు. దాంతో శ్యామ్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని నిందితులు రక్తం మడుగులోంచి తీసి కొత్త దుస్తులు తొడిగించి వెళ్లిపోయారు.
సోమవారం స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు మహిళలు, యువకుడు ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications