అక్కను వేధిస్తున్నాడని బావను చంపేశాడు
హైదరాబాద్ : అక్కను వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి క్షణికావేశంతో వ్యవహరించాడు. స్నేహితుడితో కలిసి తన బావను హత్య చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని, అతనికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని రాంబాగ్ అత్తాపూర్‌కు చెందిన రాము(43)తో నాంపల్లి పటేల్‌నగర్ ప్రాంతానికి చెందిన శాంత(37)తో 26 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. మద్యానికి బానిసైన రాము భార్య పిల్లలను నిత్యం వేధించేవాడు. ఇది భరించలేక శాంత తన సోదరుడు అమిల్‌పూర్ నర్సింగ్ అలియాస్ విక్కీ(39)కి విషయం చెప్పింది. ఎలాగైనా భర్త వేధింపుల నుంచి రక్షించాలంటూ వేడుకుంది.

దీంతో విక్కీ తన చిన్ననాటి స్నేహితుడైన జియాగూడకు చెందిన సింగేరీ రాజేశ్ అలియాస్ లడ్డు((35)తో బావ హత్యకు పథకం పన్నాడు. ఈనెల 17న తెల్లవారుజామున రాజేష్‌తో కలిసి నర్సింగ్ తన బావను బయటకు తీసుకెళ్లాడు. ముగ్గురి కలిసి ఓ చోట మద్యం సేవించారు. అక్కడి నుంచి ప్యాసింజర్ ఆటోలో గండిపేట వరకు వెళ్లి గండిమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో రాము మెడకు వైరు బిగించి హత్య చేసి పరారయ్యారు.
అనుమానాస్పదంగా మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. విచారణంలో నేరం అంగీకరించడంతో నర్సింగ్, రాజేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు తెలిపారు.












Click it and Unblock the Notifications