రెండో భార్యను చంపేసి, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు

హైదరాబాద్: ఓ వ్యక్తి తన రెండో భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. రెండో భార్యను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బైక్‌పైనే మూటలు తీసుకుని వెళ్లి నిర్మానుష్యమైన ప్రదేశంలో పడేశాడు. ఇదంతా పట్టపగలు జరిగింది. ఆమెను తాను ఫలానా చోట ముక్కలు ముక్కలుగా నరికానని నిందితుడే స్వయంగా చెప్తే గానీ విషయం తెలియలేదు.

తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో జరిగింది. విజయవాడకు చెందిన దుర్గా విజయ్ బాబు (40) బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఇందిరా నగర్‌లో నివాసం ఉంటూ నందినగర్ సమీపంలోని ఓ బిల్డర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లలితానగర్‌కు చెందిన వేల్పూరి రమణకుమారి (36)తో రెండేళ్లుగా పరిచయం చేసుకుని సహజీవనం చేస్తున్నాడు.

Man kills second wife in Hyderabad and chopped into pieces

అయితే అతనికి అది వరకే పెళ్లై భార్య ఉంది. రమణకుమారితో రెండేళ్లు సహజీవనం చేశాడు. అమ్మాయి బంధువులు ఒత్తిడి తేవడంతో తాళి కట్టాడు. అది తెలిసి మొదటి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీన్ని తట్టుకోలేకపోయిన అతడు రెండో భార్యను ఖండ ఖండాలుగా నరికి హత్య చేశాడు.

భార్యతో మనస్పర్థలు రావడంతో విజయ్‌బాబు రాజమండ్రికి వెళ్లి అక్కడ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే రమణకుమారి అనే యువతితో పరిచయం ఏర్పడి సాన్నిహిత్యం పెరిగి సహజీవనం వరకు వెళ్లారు. ఇటీవల అతడు తన మొదటి భార్య వద్దకు వెళ్లిపోయాడు. ఎన్నిరోజులైనా అతడు తిరిగి రాకపోవడంతో రమణకుమారి రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో సహజీవనం విషయం విజయ్‌ మొదటి భార్యకు తెలిసింది. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రమణకుమారి బంధువుల ఒత్తిడితో ఆమెను పెళ్లిచేసుకున్నాడు. విజయవాడలో కాపురం పెడతామని ఆమె సోదరి పద్మావతిని నమ్మించాడు. ఆగస్టు 3న వారిద్దరు విజయవాడకు వచ్చారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.

Man kills second wife in Hyderabad and chopped into pieces

ఆ మరుసటి రోజే నిద్రిస్తున్న రమణకుమారి తలపై ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశాడు. కత్తితో ముక్కలుముక్కలుగా నరికేశాడు. మొండెం, చేతులు కాళ్లను ఓ సూట్‌కేసులో పెట్టి యూసుఫ్‌గూడ జానకమ్మ తోటలో పడేశాడు. తలను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి మాదాపూర్‌ గుట్టలబేగంపేటలో పడేశాడు. ఏమి తెలియనట్టు ఇందిరానగర్‌లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

రమణకుమారి నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోవడంతో ఆమె అక్క పద్మావతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదుచేసింది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న విజయ్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. నిందితుడిని విజయవాడకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+