భార్య, కొడుకుని చంపిన భర్త, కొడుకును ఓ తల్లి
మెదక్: అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో దారుణం జరిగింది. అదిలాబాద్ జిల్లాలోని భైంసా మండలం గుండేగాంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, కుమారుడిని హతమార్చి, ఆ తర్వాత తాను కూడా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
దాదేరావు అనే 42 ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి వివాహానికి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. ఆ మైకంలో భార్య సవిత (38)తో ఘర్షణ పడ్డాడు. ఆదివారం ఉదయం వరకు అది సాగింది. ఆవేశంతో అతను తన భార్య తలను గొడ్డలితో నరికాడు. అక్కడే పడుకొని ఉన్న కొడుకు మారుతి (12) తల్లిని కాపాడుకునేందుకు.. తండ్రికి అడ్డుపడ్డాడు.
ఆవేశంలో ఆ తండ్రి కన్న కొడుకును కూడా నరికాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో దాదేరావు, కొడుకు మారుతి మృతి చెందారు. సవిత మాత్రం ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కూతురు సోని అమ్మమ్మ ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో తప్పించుకుంది.
భర్తపై కోపంతో కన్నకొడుకుపై కిరోసిన్ పోసి నిప్పటించిన తల్లి

మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం జూకల్ గ్రామంలో సంగయ్య, సత్యమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఓ కుమారుడు (21), ఓ కుతూరు (12) ఉన్నారు. కుమారుడు మానసిక వికలాంగుడు. కాగా, భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి ఆ కన్నకొడుకు ప్రాణాలు తీసింది.
ఇటీవల సంగయ్య ఆరుగుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమికి డబ్బులు చెల్లించాల్సి ఉందని, నగలు కానీ, డబ్బులు కానీ ఇవ్వాలని భార్యను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేని సత్తెమ్మ కిరోసిన్ తీసుకుని మతిస్థిమితం లేని కొడుకు యేసు(21)పై పోసి నిప్పంటించింది.
పక్కనే ఉన్న పన్నెండేళ్ల కుమార్తె గంగమ్మ వారించినా ఆమె వినలేదు. మంటల్లో కాలిపోతున్న యేసును గమనించిన స్థానికులు 108లో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యేసు మరణించాడు.












Click it and Unblock the Notifications