భార్యనూ ఇద్దరు పిల్లలను చంపేసి, లొంగిపోయాడు
హైదరాబాద్: ఓ వ్యక్తి హైదరాబాదులో అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. భార్యను తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాదులోని బిహెచ్ఈల్ సమీపంలోని తెల్లపల్లికి చెందిన సురేందర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
సురేందర్, వరలక్ష్మి దంపతులకు నితీష్, యశ్వసిని అనే ఇద్దరు పిల్లలున్నారు. సురేందర్ తన భార్యాపిల్లలతో కలిసి ఉగాది పండుగకు మీర్పేట శివనారాయణపురంలోని అత్తగారింటికి వెళ్లాడు

సురేందర్ మంగళవారం తెల్లవారు జామున తన భార్యాపిల్లలను అతి దారుణంగా చంపేసి మీర్పేట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. భార్యాపిల్లలను అతను హత్య చేయడానికి కారణమేమిటనేది తెలియదు.

ఇటీవలి కాలంలో మీర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటన ఇది రెండోది. గత నెల ఓ ల్యాబ్ టెక్నీషియన్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు.












Click it and Unblock the Notifications