అనుమానంతో మృగంలా.. భార్యను సుత్తితో.. వీడియోతో పైశాచికానందం
భార్య రక్తపు మడుగులో విలపిస్తుంటే.. ఆ ఉదంతాన్ని తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు.
చింతపల్లి: నల్గొండ జిల్లాలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న ఇల్లాలినే కర్కషంగా కడతేర్చాడు. అనుమానమనే పెనుభూతం అతనిలో బలంగా నాటుకుపోవడంతో.. భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం రోటిగడ్డతండాకు చెందిన సేనావతు రాజు అదే గ్రామానికి చెందిన యువతిని పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా, వృత్తిరీత్యా రాజు బోర్ వెల్ వర్కర్ గా పనిచేస్తుండటంతో ఇంటికి వచ్చేది తక్కువే.
ఈ క్రమంలోనే అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరుచూ భార్యతో గొడవపడుతుండేవాడు. సంక్రాంతి రోజు కూడా భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఎవరితో సంబంధం పెట్టుకున్నావో చెప్పాలంటూ భార్యను వేధించాడు.

అక్కడితో ఆగక, సుత్తితో భార్య చేతులు, భుజాలు, తలపై విపరీతంగా కొట్టాడు. తమ ఇద్దరు పిల్లలు చూస్తుండగానే కనీస కనికరం కూడా లేకుండా రాజు ఈ దారుణానికి పాల్పడ్డాడు. అంతేకాదు, భార్య రక్తపు మడుగులో విలపిస్తుంటే.. ఆ ఉదంతాన్ని తన సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు.
సుత్తితో కొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలైన రాజు భార్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం రాజు ఇంటి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి రాజును పట్టుకున్నారు. ప్రస్తుతం రాజు రిమాండ్ లో ఉన్నాడు.












Click it and Unblock the Notifications