ప్రేయసి బాలికను ఇంట్లోకి పిలిచి గడియ వేసింది: ప్రియుడు బీర్ తాగించి రేప్ చేశాడు
హైదరాబాద్: కామాంధులు హైదరాబాదులోని రెండు చోట్ల రెచ్చిపోయారు. బాలికలపై అత్యాచారానికి తెగబడ్డారు.కుత్బుల్లాపూర్, బాలానగర్‌లో ఈ దారుణాలు జరిగాయి. నిందితులపై నిర్భయ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి మాత్రం ఓ బాలికపై అత్యంత దారుణంగా ప్రవర్తించి, తన కామవాంఛను తీర్చుకున్నాడు.
పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సీఐ వెంకటరంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం - మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్‌కు చెందిన ఎల్లం(45) బతుకుదెరువు కోసం నగరశివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్‌కు వలస వచ్చాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. చేగుంటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను సైతం పద్మానగర్ రింగురోడ్డు వద్దకు తీసుకొచ్చాడు.
అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని కాపురం చేస్తున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటి పక్కన ఉండే ఓ బాలిక(14)పై ఎల్లం కన్నుపడింది. ఆ బాలిక తనకు కావాలని, అలాగైతేనే నీతో కాపురం చేస్తానని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను బెదిరించాడు.
బెదరింపులకు లొంగిన ఆమె ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాలికను చీరలను చూద్దామని ఇంట్లోకి పిలిచింది. ఇంట్లోకి రాగానే తలుపు వేసి బెదిరించింది. అప్పటికే ఉన్న ఎల్లం తనకు సహకరించాలని, లేకుంటే హతమారుస్తానని బెదిరించాడు. బాలికకు బీరు తాగించిన కామాంధుడు ఎల్లం ఆ మహిళ ముందే లైంగిక దాడికి ఒడిగట్టాడు. విషయం ఎవరికైనా చెబుతే బాగుండదని హెచ్చరించి వదిలేశాడు.

బాధితురాలు సోమవారం పక్కింట్లో ఉండే ఓ పని మనిషికి జరిగిన ఘోరాన్ని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెపిపంది. బాధితురాలి కుటుంబ సభ్యులు పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై నిర్భయ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లంతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్నేహితుడి కూతురపై కన్నేసి రేప్
ఇదిలావుంటే, ఓ బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి ఒడిగట్టారు.అక్బర్ (25) మహుమద్ రషీద్ (25) మొగల్‌పురా వాసులు. సరూర్‌నగర్ మండలం బాలాపూర్ గ్రామ పరిధిలోని బిస్మిల్లా కాలనీకి చెందిన స్నేహితుడి కూతురు( 13) పై కన్నేశారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అఘాయిత్యం చేశారు.
బాధితురాలు తన కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులపై నిర్భయ కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ సీఐ చలపతిరావు తెలిపారు.












Click it and Unblock the Notifications