పోలీసులు అన్నంత పనీ చేశారు: 'ప్రభుత్వ ఉద్యోగాలకు, పాస్‌పోర్ట్‌ కూడా రానివ్వం'

హైదరాబాద్: నగర పోలీసులు అన్నంత పనీ చేశారు. 'లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే జైలుకే' అంటూ కొద్ది రోజులుగా హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేస్తూ లైసెన్స్ లేకుండా ఆటో నడుపుతున్న వ్యక్తిని, ఓ ద్విచక్ర వాహనదారుడిని జైలుకు పంపారు.

రెండుసార్లు హెచ్చరించిన తర్వాత మూడోసారే శిక్ష విధించినా లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జైలుశిక్ష విధించడం హైదరాబాద్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే మార్చి 1వ తేదీ నుంచి రోడ్డు భద్రతలో భాగంగా సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిన సూచలను నగర పోలీసులు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

హెల్మెట్లు, డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు మార్చి 1 నుంచి పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలోనే మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్‌ ఏడుకొండలు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా మార్చి 5న మొట్టమొదటిసారి నాంపల్లిలో పట్టుబడ్డాడు.

Man sent jail for two days without helmet in hyderabad

దాంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు పని వేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలోనే ఉండాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. అయినా, లైసెన్స్‌ తీసుకోని ఏడుకొండలు శనివారం రెండోసారి పోలీసులకు దొరికిపోయాడు.

దీంతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆటో డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక రోజు జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే, డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా మోటారు సైకిల్‌ నడుపుతూ మూడోసారి పట్టుబడిన మీర్‌చౌక్‌కి చెందిన ఇస్మాయిల్‌కు కూడా కోర్టు ఒకరోజు జైలుశిక్ష విధించింది.

ఇస్మాయిల్‌ మొదటిసారి పట్టుబడినప్పుడు పోలీసులు జరిమానా విధించారు. రెండోసారి కోర్టులో హాజరపర్చగా, పనివేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలోనే ఉండాలని ఆదేశించింది. శనివారం మూడోసారి పట్టుబడటంతో జడ్జి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

కాగా, హెల్మెట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడపడం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వంటి ఉల్లంఘనలకు కోర్టు 2 రోజులు శిక్ష విధిస్తే ఉద్యోగాలకు, పాస్‌పోర్ట్‌ పొందడానికి అనర్హులవుతారని ట్రాఫిక్‌ డీసీపీ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన నగర ట్రాఫిక్ పోలీసులు రోజూ సుమారు 600 కేసులు రాస్తున్నారు.

పట్టుబడ్డ వారు చాలామంది మొదటిసారి జరిమానాలు కట్టి, లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. అయితే ఇలా దొరికిన వారిలో 65 మంది పది రోజులు తమ వాహనాలను తీసుకెళ్లడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు రావడం లేదు. సమాచారం ఇచ్చినా జైలు శిక్షలు పడతాయనే భయంతో వాహనాలను తీసుకెళ్లడం లేదని అన్నారు. ఇలాంటి వారిపై కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసి, వా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+