సహ ఉపాధ్యాయురాలిపై యాసిడ్ దాడికి యత్నించిన కీచకుడు..

సహ ఉపాధ్యాయినిని కొంతకాలంగా వేధిస్తూ వెంటపడ్డాడు. వినకపోవడంతో ఏకంగా యాసిడ్‌ దాడికి యత్నించాడు.

నిర్మల్‌ : విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడే వక్రమార్గం పట్టాడు. తోటి వాళ్లకు మార్గనిర్దేశనం చేయాల్సిన వైస్‌ ప్రిన్సిపాల్‌ సహ ఉపాధ్యాయినిని కొంతకాలంగా వేధిస్తూ వెంటపడ్డాడు. వినకపోవడంతో ఏకంగా యాసిడ్‌ దాడికి యత్నించాడు.

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తాలోగల గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆర్ఫాన్‌ అహ్మద్‌ బుధవారం రాత్రి అదే స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయిని ఇంటికి వెళ్లి ఆమెపై యాసిడ్‌ దాడికి యత్నించాడు.

అడ్డుకున్న ఆమె తండ్రిపైనా దాడిచేసి పారిపోయాడు. బాధిత కుటుంబీకులు వెంటనే షీ టీమ్‌కు, 100 నంబర్‌కు డయల్‌ చేసి విషయం చెప్పినా వారు వెంటనే స్పందించలేదు. గురువారం ఉదయం బాధితురాలు కుటంబసభ్యులతో పాఠశాలకు రాగా మద్దతుగా బీజేపీ, హిందూవాహిని, వివిధ సంస్థల నాయకులు స్కూల్‌కు చేరుకని ఆందోళన చేపట్టారు.

Man tried to Acid attack on a teacher in Nirmal

పట్టణ పోలీసులు వచ్చి ఇర్ఫాన్‌ అమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేప్టిన వారిని అరెస్టుచేసి కేసు నమోదు చేశారు. దీంతో ఆయా పార్టీలు, సంఘాల నాయకులు పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో వీరిపై పట్టణ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై సునీల్‌కుమార్‌ లాఠీచార్జ్‌ చేశారు. ఆయా పార్టీల నాయకులతోపాటు పలురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడిపై నిర్భయ కేసును నమోదు చేసినట్లు సీఐ జీవన్‌రెడ్డి తెలిపారు. పాఠశాల వద్ద ఆందోళనకు పాల్పడిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. నాయకల అరెస్టులకు నిరసనగా పలు సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌ చేపట్టారు.

నూలుపోగే.. ఉరితాడై: అప్పుల బాధకు బలైన చేనేత కార్మికుడు

జనగామ: వంశపారంపర్యంగా వచ్చిన చేనేత వృత్తినే నమ్ముకొని జీవిస్తునన ఓ చేనేత కార్మికుడికి ఆ వృత్తి కలిసిరాక... అప్పులు, అనారోగ్యం వెంటాడాయి. ఈ తరుణంలో కలత చెంఖిదిన అతను ఉరివేసుకున్నాడు. జనగామ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని మార్గం సత్యనారాయణ (41) చేనేత వృత్తినే నమ్ముకొని జీవించేవాడు.

గత 23 ఏళ్లుగా చేనేత వృత్తి ద్వారా ఆశించిన వేతనాలు పడవకపోవడంతో దిన దినం అప్పులు పేరుకుపోయాయి. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై అస్పత్రుల పాలవ్వడంతో మరింత అప్పుల్లోకి కూరుకుపోయాడు. ఇీవల కొంత ఆరోగ్యం కుదుటపడి చేనేత వృత్తిని కొనసాగిస్తున్పప్పికీ.. చేసిన మూడు లక్షల అప్పులు తీరేటట్టు లేవని కలత చెందేవాడు.

కుటుంబ పరిస్థితులను అధిగమించేందుకు ఇతని భార్య శోభ ఇంటర్‌ చదవుతున్న తన కొడుకు రాజేష్‌ను, తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు ప్రసన్నను సైతం కూలీ పనులకు తీసుకెళ్తోంది. కాగా, గురువారం రాత్రి సత్యనారాయణ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కూలీ పనులు ముగించుకొని రాత్రి 7 గంటలకు భార్య ఇంికి చేరేసరికి తలుపు ప్టిె ఉంది. అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిపించగల తలుపులు పగులగ్టొి చూసేసరికి నేత నేసేందుకు వాడే తాడుతో సత్యనారాయణ ఉరి వేసుకొని మృతి చెంది ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+