వడ్డీ వ్యాపారి దుర్మార్గం: బాకీ చెల్లించలేదని మహిళను వివస్త్రను చేయబోయాడు
హైదరాబాద్: నగరంలోని వడ్డీ వ్యాపారాల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. బాకీ చెల్లించలేదన్న కారణంతో శంషాబాద్‌కు చెందిన వడ్డీ వ్యాపారి బండారి శ్రీనివాస్ అందరూ చూస్తుండగా నడి బజారులో ఓ మహిళను వివస్త్రను చేసేందుకు యత్నించాడు.
శంషాబాదులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం కలకలం రేపింది. వడ్డీ వ్యాపారి ఘాతుకంతో ఆందోళకు గురైన బాధితురాలు పరుగు పరుగున సమీపంలోని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

అనంతరం జరిగిన ఘటన, వడ్డీ వ్యాపారి శ్రీనివాస్‌పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వడ్డీ వ్యాపారి బండారి శ్రీనివాస్ కోసం వెతుకులాట ప్రారంభించగానే అక్కడ నుంచి చిన్నగా జారుకున్నాడు.
బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీనివాస్ కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications