గన్ బయటకు కనిపించేలా బైక్‌పై వెళ్తూ.., పోలీసులకు ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఓ ఎస్సై సివిల్ డ్రెస్‌లో తన గన్‌ను బయటకు కనిపించేలా, బైక్ పైన వెళ్తుండగా కొందరు వ్యక్తులు చూశారు. అతను ఎవరోనని భావించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా, పోలీసులు విచారిస్తే అతను ఓ ఎస్సై అని తెలిసిందని వార్తలు వస్తున్నాయి.

Man with gun in Hyderabad road!

ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సైదాబాద్ నుంచి చాదర్‌ఘాట్‌కు ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నాడు. అతను తన నడుము వద్ద తుపాకీ పెట్టుకొని ఉన్నాడు. అది బయటకు కనిపిస్తోంది. దానిని చూసిన కొందరు ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు..

వెంటనే మలకపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మలకపేట పోలీసులు చాదర్‌ఘాట్ పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు అతనిని అక్కడ ఆపి వివరాలు ఆరా తీశారు. తాను ఎస్సైనని అతను చెప్పారు. అనంతరం అతను తన గన్‌ను లోపల పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
SI going on bike with his gun in civil dress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి