మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు
మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. జలపల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిన్న ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే మోహన్ బాబు సైతం కొడుకు నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
— Siddhu Manchikanti Potharaju ☭ (@SiDManchikanti) December 10, 2024
దీంతో మంచు మనోజ్‌పైన ఆయన భార్య మౌనికపైన పోలీసులు కేసు నమోదు చేశారు.మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. దీంతో మోహన్ బాబు ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ ముదిరింది. తాజాగా జలపల్లిలోని మంచు టౌన్‌కు మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు.

ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడకు భారీగా చేరుకుంది. లోపలకి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు.మీడియా పై మోహన్ బాబు అరాచకం సృష్టించారు. సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణా రహితంగా మీడియా పై దాడి చేశారు.మైక్ లాగి మరీ మీడియా ప్రతినిధిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటనలో సదరు మీడియా ప్రతినిధికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మోహన్ బాబు గన్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులకు అదేశాలు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు గన్ కూడా సీజ్ చేయాలని అధికారులను అదేశించారు.జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్స్‌లు పొందిన మోహన్‌బాబు, విష్ణు.. ఇద్దరి తుపాకుల లైసెన్స్‌లు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications