కృష్ణుడికి లేని వివక్ష మీకెందుకు? మందకృష్ణ సూటి ప్రశ్న..!
శ్రీకృష్ణుడికి లేని కుల వివక్ష మీకెందుకని హిందూ ధర్మ పరిరక్షకుల్ని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ ఇవాళ ప్రశ్నించారు.
తమ మాదిగ జాతికి చెందిన జాంబవంతుడి కూతురును శ్రీకృష్ణుడు వివాహమాడలేదా అని అడిగారు. తెలంగాణలోని ఎల్లంపల్లిలో మాదిగ బిడ్డను హత్య చేసింది యాదవుడే కదా అన్నారు. లోకంలో ఇదేం ధర్మమని ఆయన ప్రశ్నించారు. అందరూ సమానమేనని హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావాలన్నారు. కుల మత వివక్షలేని రాజ్యాన్ని స్థాపిద్దామన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామంలో ఇటీవల దళితుడు ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు గురైన సందర్భంగా ఆయన దశదినకర్మ కార్యక్రమంలో మందకృష్ణ పాల్గొన్నారు. ఎర్ర రాజశేఖర్ పరువు హత్యకు దారి తీసిన విషయాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్న మందకృష్ణ.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు పూజించే శ్రీకృష్ణుడు, యాదవులకు ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడు ఆనాడు తమ జాతికి చెందిన జాంబవంతుడు కుమార్తె జాంబవతిని వివాహమాడారని ఆయనకు లేని కుల వివక్ష ఇక్కడ యాదవులకు ఎందుకని ? మందకృష్ణ మాదిగ అన్నారు.

ఎల్లంపల్లి గ్రామంలో దళితుడు ఎర్ర రాజశేఖర్ సోదరుడు యాదవ యువతిని ప్రేమించిన కారణంగా ఆ యువతి తండ్రి వెంకటేష్ ఒక యాదవుడని అతనికి తమ దైవం శ్రీకృష్ణ భగవానుడు గురించి తీయలేదని ప్రశ్నించారు. భగవంతుడే కులాలను విశ్వసించకుండా వివాహమాడినప్పుడు అప్పుడు యాదవ వంశ పెద్దలకు లేని వివక్ష ఇక్కడ సమాజంలో కుల వివక్ష ఎందుకు వచ్చిందని ఘాటుగా ప్రశ్నించారు. సమాజంలో పెట్రేగిపోతున్న కుల వివక్షను రూపుమాపడానికి హిందూ ధర్మ రక్షకులు, సనాతన ధర్మాన్ని కాపాడే వారు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భగవంతుడు సమాజంలో కుల మతాలకు అతీతంగా అందరిని సమానంగా చూడమని బోధించాడని మరి హిందూమతంలోని ఇలాంటి వివక్షలు పెరిగి చంపేందుకు కారణం అవుతుంటే వీటిపై మాట్లాడడానికి హిందూ ధర్మ రక్షకులు ముందుకు రావలసిన సమయం ఆసన్నమైందని మందకృష్ణ సూచించారు. కుల వివక్ష కరోనా కంటే ప్రమాదకరమైనదని, కరోనా ను రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఆ మహమ్మారిని పారద్రోలు ఎందుకు ఇలాంటి ప్రచార చర్యలు తీసుకున్నారు ప్రత్యేక నిధులు కేటాయించారు కుల వివక్షను కూడా రూపుమాపేందుకు అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుల వివక్ష వెంటనే పోదని కాకపోతే రాబోయే భవిష్యత్తులో కచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మందకృష్ణ మాదిగ అన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications