వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కు కరోనా: హైకోర్టు సంచలనం.. మాండమస్ పిటిషన్‌పై అనూహ్య స్పందన

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో కరోనా మహమ్మారి భయానకంగా విజృంభిస్తుండటం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు, ప్రైవేటు హాస్పిటళ్లలో అధిక ఫీజులు.. తదితర వార్తల నడుమ.. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా సోకిందని, సీఎం కేసీఆర్ కూడా వైరస్ కాటుకు గురయ్యారన్న ప్రచారం సంచలనం రేపింది. సీఎం కూడా పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వకపోవడంతో #whereiskcr, #kcrmissing లాంటి హ్యాష్ ట్యాగులు విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన మాండమస్ పిటిషన్ పై హైకోర్టు అనూహ్యంగా స్పందించింది..

చైనా షాకింగ్ ప్రకటన: కరోనా కంటే డేంజర్.. అంతుచిక్కని మరో వైరస్ వ్యాప్తి.. కజకిస్తాన్ లో మృత్యువిలయంచైనా షాకింగ్ ప్రకటన: కరోనా కంటే డేంజర్.. అంతుచిక్కని మరో వైరస్ వ్యాప్తి.. కజకిస్తాన్ లో మృత్యువిలయం

ఒక షాక్.. కొంత ఊరట..

ఒక షాక్.. కొంత ఊరట..

కరోనా విలయం వేళ కేసీఆర్ ఎక్కడున్నారు? ఎలా ఉన్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నవేళ ఆ ప్రచారాలక ఫుల్ స్టాప్ పెడుతూ సీఎం కేసీఆర్ చర్యలకు ఉపక్రమించారు. గురువారం ఓ రైతుతో ఫోన్లో సంభాషణ.. సచివాలయం కూల్చివేతలో దెబ్బతిన్న ప్రార్థనా స్థలాలపై శుక్రవారం మరో ప్రకటన.. ఇలా జనానికి, టీవీ కెమెరాలకు నేరుగా కనిపించకపోయినా.. ఫామ్ హౌజ్ లో ఉన్నా.. తాను పనిలోనే నిమగ్నమై ఉన్నట్లు కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఇక హైకోర్టులో, సచివాలయం కూల్చివేతపై కేసీఆర్ సర్కారుకు ఎదురుదెబ్బ తగలగా, ఆయన ఆరోగ్యపై దాఖలైన పిటిషన్ పై మాత్రం ఊరట లభించింది.

తీన్మార్ మల్లన్నకు ఝలక్..

తీన్మార్ మల్లన్నకు ఝలక్..

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యేలా ఆదేశాలు జారీ చేయాలంటూ నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బుధవారం హైకోర్టులో మాండమస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. ప్రగతి భవన్ లో కరోనా, సీఎం అందుబాటులో లేకపోయేసరికి వివిధ శాఖల అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, జనంలో కరోనా భయాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ మాండమస్ పిటిషన్ ను విచారణకు స్వీకరించబోమంటూ హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాదు, పిటిషనర్ ను ఉద్దేశించి అనూహ్య వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

India Global Week 2020: PM Modi Speech కరోనా తరువాత భారత్ అగ్రగామిగా మారుతుంది..!! | Oneindia Telugu
పొలిటికల్ జిమ్మిక్కులా?

పొలిటికల్ జిమ్మిక్కులా?


‘‘మాండమస్ పిటిషన్ ద్వారా పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేం. ముఖ్యమంత్రి కనిపించకపోతే మాండమస్ పిటిషన్ కాదు.. హెబియస్ కార్ప్ దాఖలు చేసుకోండి'' అంటూ హైకోర్టు పిటిషనర్ కు సూచించింది. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఇప్పటికే తీన్మార్ మల్లన్నపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎంపై ఆయన వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది. కోర్టు సూచనల మేరకు మల్లన్న హెబియస్ కార్ప్ దాఖలు చేస్తారా, లేదా అనేది వెల్లడి కావాల్సి ఉంది.

English summary
telangana high court key remarks over the Mandamus petition which was filed by Naveen alias teenmar mallanna regarding chief minister kcr health condition on friday. the court says it will not take it as emergence case and warned petitioner to don't play cheap politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X