హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింగర్ మంగ్లీపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు -రాచకొండ పోలీసుల యాక్షన్? -నా జాతి, ప్రాంతంపై విమర్శలా?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ గాయని సత్యవతి అలియాస్ మంగ్లీపై బీజేపీ నేతల ఫిర్యాదుతో బోనాలు పాట వివాదం మరో మలుపు తిరిగింది. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా మంగ్లీ పాడిన పాటపై కొద్ది రోజులుగా దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మొన్న హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. మరోవైపు తన పాటపై నెలకొన్న వివాదంపై సింగర్ మంగ్లీ తొలిసారి స్పందించారు. వివరాలివి..

 సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలనం -కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు -ఎన్నికల్లో కవిత vs సీతక్క? సింగరేణిపై సీఎం కేసీఆర్ సంచలనం -కార్మికుల రిటైర్మెంట్ వయసు 61కి పెంపు -ఎన్నికల్లో కవిత vs సీతక్క?

మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు

మంగ్లీపై పోలీసులకు ఫిర్యాదు

బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్ మంగ్లీపై బీజేపీ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ కు చెందిన పలువురు బీజేపీ కార్పొరేటర్ల బృందం మంగళవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మంగ్లీ పాటను తక్షణమే సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లీపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు. కాగా, కేసు నమోదుపై సీపీ కార్యాలయం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా,

Telangana: భూముల విలువ పెంపు -ఎకరా రూ.75వేలు -చార్జీల బాదుడు -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులుTelangana: భూముల విలువ పెంపు -ఎకరా రూ.75వేలు -చార్జీల బాదుడు -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు

వివాదంపై తొలిసారి మంగ్లీ స్పందన

వివాదంపై తొలిసారి మంగ్లీ స్పందన

బోనాల పాటపై కొనసాగుతోన్న తీవ్ర వివాదంపై సింగ్ మంగ్లీ తొలిసారి స్పందించారు. ''నన్ను నా పాటను ఆదరిస్తున్న, అభిమానిస్తున్న అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం నేను పాడిన బోనాల పాట గురించి చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు ,80 సంవత్సరాలు కలిగిన పెద్దాయన పాలమూరు రామస్వామి గారు 25 ఏళ్ళ క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది. 2008లో ఈ పాటను డీఆర్సీ ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారు. ఆ పెద్దాయన రాసిన జానపదాలు నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకున్నాం. ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించాం. 300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతిలోనే ఉన్నాయి...

ఆ పదాలకు అర్థం ఇదే..

ఆ పదాలకు అర్థం ఇదే..


''చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ'' అని సాగే ఈ పాటలో 'మోతెవరి' అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము.
గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి.భక్తిలో కూడా మూఢ భక్తి,వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి.. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం

నాది అలాంటి కుటుంబం కాదు..

నాది అలాంటి కుటుంబం కాదు..

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్ గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వలనే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో ఆంజనేయ స్వామి గుడికట్టించాను. మా తాతలనాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నాము. నీకు గుడికట్టించే ధైర్యం, పేరు నాకు ఇవ్వాలి స్వామి అని మొక్కుకున్నాను. ఆ దేవుని దయవల్ల గత ఏడాది నవంబర్ 19న నా మొక్కును తీర్చుకున్నాను.

Recommended Video

Bonalu 2021 : Mangli బహిరంగ క్షమాపణ చెప్పాలి.. లిరిక్ మార్చాల్సిందే..!! || Oneindia Telugu
నా జాతి, ప్రాంతీయతపై విమర్శలా?

నా జాతి, ప్రాంతీయతపై విమర్శలా?

ఏనాడు గుడికి వెళ్ళని వాళ్ళు, బోనం ఎత్తని వాళ్ళు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలి. ఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామిగారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశాం'' అని సింగర్ మంగ్లీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటన చేశారు.

English summary
amid controversy over bonalu song 2021, the BJP leaders have lodged a complaint with the Rachakonda Police Commissioner against Singer Mangli. bjp leaders alleges that abusive language used in song. earlier, singer mangli clarified about the lyrics of bonalu song 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X