హైదరాబాద్ అమ్మాయి ‘ఆకర్షణ’పై ప్రధాని మోడీ ప్రశంసలు: ఎందుకంటే?
హైదరాబాద్: నగరానికి చెందిన ఆకర్షణ అనే 7వ తరగతి విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. చదువుకోవడంతోపాటు నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న విద్యార్థిని ఆకర్షణ సతీష్‌ను చూసి గర్విస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమెను ప్రధాని అభినందించారు.
ఆకర్షణ చేసిన ప్రయత్నం గురించి 2 నిమిషాల 7 సెకన్లపాటు ప్రధాని మాట్లాడారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఆకర్షణ.. ఇరుగు పొరుగువారి నుంచి సేకరించిన 6 వేల పాత పుస్తకాలతో ఇప్పటి వరకు 7 గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 2021లో కరోనా వైరస్ సమయంలో ఒకరోజు ఆకర్షణ తన తల్లిదండ్రులతో కలిసి ఆహారాన్ని అందించడానికి ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి వెళ్లింది.

ఇక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు నొప్పి నుంచి ధ్యాసను పఠనం వైపు మళ్లించడానికి పుస్తకాలు బహూకరించాలనే ఆలోచన చేసింది. అక్కడే తొలుత ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ఇది ఇలావుండగా, అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆకర్షణను కలుస్తానని మోడీ హామీ ఇచ్చారని ఆకర్షణ తండ్రి షతీష్ కుమార్ తెలిపారు. నిజామాబాద్‌లో కలుసుకునేలా అపాయింట్ మెంట్ ఖరారు చేసే అవకాశం ఉందని సతీష్ తెలిపారు.
కాగా, వచ్చే వారం సిద్దిపేటలో ఆకర్షణ ఏర్పాటు చేయనున్న ఎనిమిదో గ్రంథాలయాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నాటికి పదో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆకర్షణ వెల్లడించింది. అయితే, తన కుమార్తెకు ఆకర్షణ అనే పేరు అబ్దుల్ కలాం పెట్టారని ఆమె తండ్రి సతీష్ కుమార్ తెలిపారు. సతీష్ అప్పట్లో కలాం దగ్గర విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications