25సార్లు ఫోన్ చేసినా..: సొంత పార్టీ టి నేతలకు పారికర్ షాక్!, కవిత ఆగ్రహం
హైదరాబాద్: కేంద్రమంత్రి, బీజేపీ నేత మనోహర్ పారికర్ సొంత పార్టీ తెలంగాణ నేతలకు షాకిచ్చారా? అంటే అవునని అంటున్నారు. ఆయనను బీజేపీ కార్యాలయానికి ఆహ్వానించేందుకు 25సార్లు తెలంగాణ బీజేపీ నేతలు ఫోన్ చేశారని తెలుస్తోంది. కానీ మంత్రి సిబ్బంది మాట్లాడే అవకాశమివ్వలేదని సమాచారం. దీంతో, తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఏపీ కంటే మాకు సగం నిధులే: కవిత
కాంగ్రెస్, బీజేపీల పైన ఎంపీ కవిత శుక్రవారం నాడు మండిపడ్డారు. ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ పార్టీ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పిందని, ఏమయిందని ప్రశ్నించారు. నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలోనే లోపం ఉందన్నారు.

తెరాస విజన్ ఉన్న పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కాంట్రాక్టర్లకు టిక్కెట్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఏపీతో పోలిస్తే తెలంగాణకు కేంద్రం సగం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ నిధుల పైన అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.
తెలంగాణకు బీజేపీ నేతలు భారీగా నిధులు ఇచ్చామని అంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు సగం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ అంశంలో అనవసర వ్యాఖ్యలు చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications