మనోజ్ Vs విష్ణు, పీక్స్ కు వార్ - పొలిటికల్ ట్విస్ట్ ..!!
సమిసిపోయిందని భావిస్తున్న వేళ మంచు కుటుంబంలో మరోసారి వివాదం మొదలైంది. తాజాగా మంచు మనోజ్ తన అన్న అనుచరులు తమ పైన కుట్రలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసారు. తన ఇంట్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడానికి జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్ పోశారని ఆరోపించారు. తన తల్లిని, తన కుటుంబాన్ని భయపెడుతున్నారని వాపోయారు. తనపై కుట్ర జరుగుతోందంటూ మంచు మనోజ్ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వివాదం వేళ కొత్తగా పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ మొదలైంది.
మనోజ్ లేఖలో
మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య మళ్లీ విభేదాలు పీక్ కు చేరాయి. అంతా సర్దుకుంటుందని భావిస్తున్న వేళ ఆకస్మికంగా మనోజ్ మరోసారి సంచలన ఆరోపణలు చేసారు. తమకు ప్రాణహాని ఉందంటూ మీడియాకు లేఖ రాసారు.ఆ లేఖలో తనను.. తన కుటుంబాన్ని విష్ణు, అతని అనుచరులు పలు విధాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు. శనివారం తాను షూటింగ్ వెళ్లిన సమయంలో తన భార్య కుమారుడి స్కూల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లారని వివరించారు. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణుతోపాటు అతడి అనుచరులు రాజ్ కందూరు, కిరణ్, విజయ్ రెడ్డితోపాటు కొంతమంది బౌన్సర్లు ఇంటికి వచ్చారని.. కాగా, ఆ సమయంలో వారు తన జనరేటర్‌లో పంచదార కలిపిన డీజిల్‌ను పోశారని మనోజ్ లేఖలో పేర్కొన్నారు.

మనోజ్ లేఖలో
దీంతో, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి .. జనరేటర్ నుంచి నిప్వు రవ్వలు ఎగిసిపడ్డాయని వివరించారు. ఆ సమయంలో జనరేటర్ కు సమీపంలోనే కార్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఇంట్లో ఉన్న తన కుమార్తెతో పాటుగా తన తల్లి, ఇంట్లో ఉన్నవారి ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని వివరించారు. ఇది పూర్తిగా కుటుంబ సమస్య.. కానీ తన కుటుంబ క్షేమం, రక్షణ కోసం అన్ని అంశాలను బహిరంగపర్చాల్సి వస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోలీసు హెచ్చరికలు ఖాత రు చేయకుండా పలు విధాలుగా తన కుటుంబానికి హాని కలిగేలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. నేను, తన కుటుంబం ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కుంటున్నామని చెప్పుకొచ్చారు.
ఆళ్లగడ్డలో ఏం జరుగుతోంది
ఈ రోజు మనోజ్ ఆళ్లగడ్డలో నిర్వహించనున్న శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలకు హాజరవు తున్నారు. మనోజ్ - మౌనిక హాజరయ్యే ఈ కార్యక్రమానికి భారీగా కార్ల ర్యాలీతో మద్దతు దారులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మనోజ్ - మౌనిక రాజకీయ ఎంట్రీ పైన చర్చ తెర మీదకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా యాక్టివ్ కావటం అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు నిర్ణయం ఉండే అవకాశం ఉందని ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో, ఇప్పుడు మంచు మనోజ్ - మౌనిక తీసుకునే నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications