సాహెబ్ నగర్ నాలాలో గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యం... ఎట్టకేలకు 7 రోజుల తర్వాత...

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్ నాలాలో ఏడు రోజుల క్రితం గల్లంతైన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడు అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. గల్లంతైన మ్యాన్ హోల్ నుంచి 350మీటర్ల దూరంలోని 12వ మ్యాన్ హోల్ వద్ద అంతయ్య మృతదేహాన్ని గుర్తించారు. కోయంబత్తూర్‌ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో అంతయ్య మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం దానిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.

గత మంగళవారం అర్ధరాత్రి సమయంలో మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు అంతయ్య, శివ అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. శివ మృతదేహాన్ని అదే రోజు అధికారులు బయటకు తీశారు. కానీ అంతయ్య ఆచూకీ మాత్రం దొరకలేదు. గత ఏడు రోజులుగా అంతయ్య మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు జీహెచ్ఎంసీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రభుత్వం కోయంబత్తూర్ నుంచి స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దింపింది. దీంతో ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యమైంది.

సాహెబ్‌నగర్‌, పద్మావతినగర్‌ కాలనీలో డ్రైనేజీ పైపు లైన్‌ జామ్‌ అవడంతో స్థానిక కాంట్రాక్టర్‌ స్వామి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయించేందుకు చంపాపేటకు చెందిన అంతయ్య (45), చింతల్‌బస్తీకి చెందిన శివ (27) అనే కార్మికులను పిలిపించాడు. మంగళవారం రాత్రి 11 గంటలకు అంతయ్య, శివను మ్యాన్‌హోల్‌లోకి దింపాడు. కొద్దిసేపటికే ఊపిరాడక శివ మృతిచెందగా, అంతయ్య గల్లంతయ్యాడు.

manual scavenging case anthaiahs dead body recovered after 7 days of search

నిజానికి మాన్యువల్ స్కావెంజింగ్‌పై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ ఇలా మాన్యువల్ స్కావెంజర్లతో నాలాలను శుభ్రం చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక పరికరాలతో డ్రైనేజీలను క్లీన్ చేయించాల్సిందిపోయి ఇలా మనుషులను మ్యాన్‌ హోల్‌లోకి దింపడమేంటని పలువురు ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారి బాధిత కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

మృతులకు ప్రభుత్వం రూ.15లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం తరుపున రూ.10లక్షలు,కాంట్రాక్టర్ తరుపున రూ.5లక్షలు ఇచ్చింది. ఇవిగాక మేయర్ గద్వాల విజయలక్ష్మి తన పరిధిలో ఉన్న నిధుల నుంచి రూ.2లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటామని... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+