Telangana: ఇప్పుడైనా తెలంగాణ అధికారులకు ప్రాధాన్యత ఇస్తారా..!
తెలంగాణలో కొత్త ఏర్పడబోయే ప్రభుత్వంలో ముఖ్య అధికారులు ఎవరు ఉంటారు అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా శాఖల అధిపతులు మార్చుతారా అని చర్చ కొనసాగుతోంది. వివిధ శాఖలకు హెచ్ వోడీలను ఉన్నోళ్లనే కొనసాగిస్తారా లేక కొత్తవాళ్లను నియమిస్తారా అనేదానిపై సెక్రటేరియెట్ వర్గాల్లో గుసగుసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రయారిటీలన్నీ మారుతాయని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాళ్లందరిని పక్కన పెట్టనున్నట్లు సమాచారం.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తమ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు. ఆ తర్వాత అగ్రవర్ణ, ఉత్తరాధి అధికారులనే ప్రోత్సహించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న వారిని మార్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. శాంతి కుమారి కాంగ్రెస్ మేనిఫెస్టో, గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆమె రిటైర్మెంట్ కు ఇంకో సంవత్సరం ఉంది. ఈలోగా ఆమె మార్చడం ఎందుకని చర్చ కొనసాగుతోంది.

మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ సెక్రటరీగా కొనసాగుతున్న అర్వింద్ కుమార్, ఐటీ, ఇండస్ర్టీస్ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హౌసింగ్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, కమర్షియల్ టాక్స్ కమిషనర్గా ఉన్న క్రిస్టీనా జడ్ చొంగ్తూ, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ అశోక్ రెడ్డి వంటివారి శాఖలు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శైలజా రామయ్యర్, బుర్రా వెంకటేశం గౌడ్, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రాహుల్ బొజ్జా వంటి వారికి ముఖ్యమైన శాఖలు అప్పగించే అవకాశం ఉంది. సీఎంవోలో తెలంగాణ ఐఏఎస్ లకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల కాలంలో ఐదారుగురు ఐఏఎస్ ఆఫీసర్లను రిటైర్డ్ అయిన తరువాత రీఅపాయింట్మెంట్ చేశారు. అయితే వీరిని కొనసాగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications