కీలక నేతలు గుడ్‌బై, టీడీపీ ఖాళీ!: మేమూ వస్తాం, వీరంతా రేవంత్ రెడ్డి వెంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వరుస రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గ్రామీణ, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పలువురు నేతలు ఆదివారం పదవులకు, పార్టీ ప్రాథమిక రాజీనామా చేశారు, చేస్తున్నారు.

MLA Revanth Reddy resignation issue ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్ | Oneindia Telugu

ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

చాలామంది నేతలు రేవంత్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు వెళ్లడం లేదని చెబుతున్నారు. రేవంత్, వేం నరేందర్ రెడ్డి బాటలోనే అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చారగొండ వెంకటేష్ గౌడ్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న సతీష్ మాదిగ కూడా రాజీనామా చేశారు. చొప్పదండి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ప్రథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

రేవంత్‌కు ఆదిలోనే షాక్, అనుమతికి నో: ధైర్యవంతుడు, కేసీఆర్-బాబు కలవడం వల్లే: లక్ష్మీపార్వతి

 రేవంత్ వెంటే వెళ్తామంటూ అనుచరులతో సమావేశాలు

రేవంత్ వెంటే వెళ్తామంటూ అనుచరులతో సమావేశాలు

తెలంగాణ టీడీపీలో పలువురు నాయకులు తాము రేవంత్ రెడ్డి వెంటే ఉంటామని ప్రకటించారు. పలు జిల్లాల్లో ముఖ్య నాయకులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి, భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేం నరేందర్ రెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఆదివారం పంపించారు.

 అదే దారిలో బోడ జనార్ధన్, సీతక్క

అదే దారిలో బోడ జనార్ధన్, సీతక్క

రాష్ట్రంలో సిద్ధాంతాలు, విధానాలకు అతీతంగా ఒక బలమైన వేదిక రూపుదిద్దుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయని, అందువల్లే పార్టీని వీడుతున్నట్లు వేం లేఖలో పేర్కొన్నారు. కాగా తాను టీడీపీకి సోమవారం రాజీనామా చేయనున్నట్లు మాజీ మంత్రి, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బోడ జనార్దన్‌ తెలిపారు. సీతక్క కూడా రేవంత్ వెంట వెళ్లనున్నారు.

 మేమూ రేవంత్ వెంటే

మేమూ రేవంత్ వెంటే

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సతీష్ మాదిగ, మేడిపల్లి సత్యం, అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్ చారగొండ వెంకటేశ్‌ కూడా తమ పదవులకు ఆదివారం రాజీనామా చేశారు. తెలంగాణ హితం కోసం తాము రేవంత్‌ వెంటే ఉంటామన్నారు.

 ఇప్పటికే అధినేతకు చెప్పేశానన్న భూపాల్ రెడ్డి

ఇప్పటికే అధినేతకు చెప్పేశానన్న భూపాల్ రెడ్డి

నల్గొండ నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి కంచర్ల భూపాల్‌రెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో ఆదివారం భేటీ అయ్యారు. అలాగే, తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై తాను స్పందించనని, అధినేత చంద్రబాబుకు చెప్పాలనుకున్నది ఇప్పటికే చెప్పానని వ్యాఖ్యానించారు. కాగా, కంచర్ల టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పలువురు జిల్లా అధ్యక్షులు

పలువురు జిల్లా అధ్యక్షులు

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పార్టీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్‌, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డిలు రేవంత్‌ వెంట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం పార్టీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు పటేల్‌ రమేశ్ రెడ్డి కూడా తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేశారు.

 విజయరమణా రావు కూడా

విజయరమణా రావు కూడా

కాగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చిలుక మధుసూదన్ రెడ్డి తన పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. రేవంత్‌ వెంట వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇక టీడీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది.

మరింత మంది పేర్లు.. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సత్యనారాయణ కూడా టీడీపీ రాజీనామా చేశారు. వేములవాడకు చెందిన సీనియర్ నేతలు ఎంఎ నసీర్, నందిపేట సుదర్శన్‌ యాదవ్‌, పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, ముంజ ఉమేందర్‌ గౌడ్, నందిపేట రమణయాదవ్, చింతలకోటి రామస్వామి తదితరులు కూడా పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many of the leaders who were supposed to join the Congress along with former TD working president ARevanth Reddy.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి