లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
ఆదిలాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏటూరునాగారం- మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి మేకల రాజు(28) అలియాస్ రాజ్‌కుమార్ అలియాస్ మురళి, అతని సహచరి ఏటూర్‌నాగారం-మహదేవ్‌పూర్ మావోయిస్టు కమిటీ సభ్యురాలు మిడియం సోమిడి (23) అలియాస్ సంగీత శుక్రవారం రూరల్ ఎస్పీ కాళిదాసు ఎదుట లొంగిపోయారు.
మేకల రాజు భూపాలపల్లి మండలం అజంనగర్ వాసికాగా, సోమిడి ఛత్తీస్‌గ ఢ్ రాష్ట్రం మద్యేడు తాలూకా చెలాం నెంద్రా గ్రామవాసి. లొంగిపోయిన వీరిని రూరల్ ఎస్పీ కాళిదాస్ శుక్రవారం జిల్లా పోలీసు కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు.

మావోయిస్టు పార్టీకి చెందిన జిల్లా స్థాయి నాయకుడు మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ రెండు రోజుల క్రితం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. మైలారపు అడెల్లుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ కూడా పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీలో నెలకొన్న అభిప్రాయ భేదాలు, ఇతర కారణాలతో అడెల్లు పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం భాస్కర్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. లొంగుబాటు విషయాన్ని పోలీసులు ధ్రువీకరించక పోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications