ఎన్నికల సమయంలో మావోయిస్టుల బిగ్ స్కెచ్.. ఆ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్!!

తెలంగాణ ఎన్నికల వేళ ఒకపక్క శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించిన పోలీసులు, మరొక తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో మావోయిస్టుల కదలికలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. దీంతో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అటవీ ప్రాంతాలను, ఏజెన్సీ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

రాజకీయ నేతలు, పోలీసులు టార్గెట్‌గా మావోయిస్టులు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో అడుగడుగూ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలలోనూ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చారు.

Maoists Big sketch during elections.. Police combing in those areas!!

ఇక తాజాగా పార్టీ యాక్షన్ టీమ్లను రంగంలోకి దింపినట్లు ములుగు జిల్లాలో కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చతిస్గడ్ లో ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు కౌసల్వార్ ప్రాంతానికి వచ్చిన బిజెపి నేత రతన్ దూబే ను పోలీస్ ఇన్ ఫార్మర్ అదే పార్టీకి చెందిన బిర్జూ తారమ్ ను కాల్చి చంపారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 614 పోలింగ్ స్టేషన్లను మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్ లుగా గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులను పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ, డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు బెదిరింపు లేఖలు రాస్తున్న మావోయిస్ట్ పార్టీ యాక్షన్ టీమ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల మావోయిస్ట్ పార్టీ బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వేసింది. ఈ క్రమంలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ పేర్లను సైతం విడుదల చేశారు.

ఇక ఎన్నికల హడావిడిలో భాగంగా ఓటర్లను ఓట్లు అభ్యర్తిస్తున్న నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దండకారణ్యం అటవీ సరిహద్దు జిల్లాల రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏజెన్సీలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+