Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టుల రెక్కీ; తెలంగాణాలో పోలీసుల భారీసోదాల వెనుక పెద్ద కథే!!

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారా? ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులకు చెక్ పెట్టడం కోసం అడవులను జల్లెడ పడుతున్న మావోయిస్టులు తమ బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవల కాలంలో పోలీసులు మావోయిస్టులపై ఇంతగా ఫోకస్ పెట్టడం వెనుక బలం పుంజుకున్న మావోయిస్టు పార్టీనే కారణమా? టిఆర్ఎస్ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి పోలీసులకు షాకిచ్చారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించిన మావోయిస్టులు

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించిన మావోయిస్టులు


తెలంగాణ రాష్ట్రంలో ధనిక, పేద మధ్య ఆదాయ అంతరం, సమాజంలో పెరుగుతున్న అన్యాయం, కుటుంబాల్లో ఫాసిజం పెరిగిపోవడంతో నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నక్సలైట్ల కార్యకలాపాలు, నిఘావర్గాల నుంచి వచ్చిన విజిలెన్స్ నివేదికలు రాష్ట్ర పోలీసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసమే మావోయిస్టు ముఖ్య నాయకులు వచ్చారా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసమే మావోయిస్టు ముఖ్య నాయకులు వచ్చారా?

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసి రెక్కీ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఇక దీనికోసమే మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశించినట్టు చర్చ జరుగుతుంది. అయితే మావోయిస్టు పార్టీ తమ చర్యను కొనసాగించటానికి ఉన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక వాతావరణం, సరిహద్దు అటవీ ప్రాంతంలో విపరీతంగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ లతో ఈ ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన మావోయిస్టులు

పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన మావోయిస్టులు


ఇదిలా ఉంటే తమ క్యాడర్‌ను బలోపేతం చేయడంతో పాటు కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడంపై మావోయిస్టు పార్టీ నాయకులు దృష్టి సారించారు. ఈ పనిని యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. పార్టీలో ఇప్పటికే కొంతమంది సీనియర్లు వివిధ కారణాలతో మృతిచెందడం, మరికొందరు పోలీసులకు లొంగిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో క్యాడర్ ను బలోపేతం చేయడంపై మావోయిస్టు పార్టీ దృష్టిసారించింది. దీనికోసం కొత్తవారిని కూడా రిక్రూట్ చేస్తోంది.

తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో పెరుగుతున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు

తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ సరిహద్దుల్లో పెరుగుతున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు


తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూడా మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాజాగా మావోయిస్టు పార్టీ నిర్వహించిన అమరవీరుల స్మారక వారోత్సవాలు పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించింది మావోయిస్టు పార్టీ.

అమరవీరుల వారోత్సవాలలో మావోయిస్టులు వర్సెస్ పోలీసులు

అమరవీరుల వారోత్సవాలలో మావోయిస్టులు వర్సెస్ పోలీసులు

ఈ కార్యక్రమాల్లో మావోయిస్టు అగ్రనేతలు సహా 10 నుంచి 12 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మావోయిస్టులు పెద్దఎత్తున మావోయిస్టు అమరవీరుల త్యాగాలను ప్రచారం చేస్తే , మరోవైపు పోలీసులు తమకు సమాచారం ఇవ్వాలని నగదు బహుమతులను ప్రకటించి, నక్సలైట్లకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వేసి మావోయిస్టులను పట్టుకునే ప్రయత్నం చేశారు. మావోయిస్టు అగ్రనేతల కదలికలపై వచ్చిన సమాచారంతో పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచారు. గ్రేహౌండ్స్ కాకుండా, స్పెషల్ పార్టీ పోలీసు దళాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

 అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకు రావడంతో రాజకీయ నేతల్లో టెన్షన్

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకు రావడంతో రాజకీయ నేతల్లో టెన్షన్

చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా వెలుగులోకి రావడం రాజకీయ నేతలు, అవినీతి అధికారులను కలవరపాటుకు గురి చేసింది. ఇదిలా ఉంటే మావోయిస్టుల కోసం గాలిస్తున్న పోలీసులు తెలంగాణలోని జిల్లాల్లో పోలీసులు ఇంటింటికీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదిఏమైనా తాజాగా రాష్ట్రంలో కనిపిస్తున్న మావోయిస్టుల అలజడి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+