ఓరి ఈడి ఏషాలో: ఫ్లాట్ లోనే పూలకుండీల్లో గంజాయి సాగు!
'పూల మొక్కలు పెంచుకుంటే ఏమొస్తుంది నా పిండాకూడు.. అదే గంజాయి మొక్కలైతే.. ఆహా.. నా సామిరంగ..' అనుకున్నాడో ఏమోగానీ ఓ ప్రబుద్ధుడు బరితెగించి అంత పనీ చేశాడు.
హైదరాబాద్: 'పూల మొక్కలు పెంచుకుంటే ఏమొస్తుంది నా పిండాకూడు.. అదే గంజాయి మొక్కలైతే.. ఆహా.. నా సామిరంగ..' అనుకున్నాడో ఏమోగానీ ఓ ప్రబుద్ధుడు బరితెగించి అంత పనీ చేశాడు.
నగరం నడిబొడ్డున కుండీల్లో గంజాయి మొక్కలు సాగు చేయడమే కాక దానిని విక్రయిస్తూ పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తానికి ఆ ప్రబుద్ధుడి భరతం పట్టారు.

గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో ఉండే సయ్యద్ అనే వ్యక్తి తన నివాసంలోనే పెద్ద పెద్ద పూలకుండీలను ఏర్పాటు చేసుకుని వాటిలో గంజాయి పండిస్తూ దొంగచాటుగా విద్యార్థులు, ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్నాడు.
కొంతకాలంగా ఈ తంతు సాగుతుండగా ముందుగా అందిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి సదరు గంజాయి మొక్కలను చూసి అవాక్కయ్యారు. వెంటనే సయ్యద్ ను అదుపులోనికి తీసుకుని, గంజాయి మొక్కాలు సహా కుండీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications