వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందుంది పెళ్లిళ్ల సీజన్..! ఇలాంటి యెదవలు కూడా ఉంటారు..! పెళ్లి మాటున నగలుకు ఎసరు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఒక్కోసారి సమాజంలో ఇంత నీచపు యెదవలు ఉంటారా అనిపిస్తుంటుంది. అలాగే మోసం చేసే విధానాలపై ఇలాంటి సన్నాసులు రీసెర్చ్ ఏమైనా చేసారా అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుంటనని నమ్మించిన ఆ దగుల్బాజీ పెళ్లి కూతురుని కాదని ఆమె వేసుకున్న నగలుతో ఉడాయించాడు. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌ సమీపంలో నివసించే ఓ నలభై ఏళ్ల మహిళ స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. 2012 ఆగస్టులో ఆమెకు పెళ్లైంది. నెలరోజుల్లోనే మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. తాజాగా ఆమెకు విడాకులు మంజూరయ్యాయి.

 మోసం చేయడంలో కొత్త పోకడలు..! కొత్త అవతారం ఎత్తుతున్న మోసగాళ్లు..!!

మోసం చేయడంలో కొత్త పోకడలు..! కొత్త అవతారం ఎత్తుతున్న మోసగాళ్లు..!!

తల్లిదండ్రుల సూచనమేరకు మరో వ్యక్తితో వివాహం చేసుకుని సెటిలయ్యేందుకు నిశ్చయించుకుంది. షాదీ డాట్‌ కామ్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో తన పేరును రిజిస్టర్‌ చేసుకుంది. ఈ క్రమంలో కోయంబత్తూరుకు చెందిన నలబై ఏడేళ్ల యువరాజ్‌ మురుగేషన్‌ తన ప్రతిపాదనను ఆమెకు పంపాడు. స్క్రాపు వ్యాపారం చేసే మురుగేశన్‌ తనకు చెన్నై, బెంగళూరులో గొప్ప వ్యాపారాలున్నట్లు నమ్మించాడు.

పెళ్లి పేరుతో నగలకు ఎసరు..! పెళ్లి కూతురును మోసం చేసే ప్రయత్నం..!!

పెళ్లి పేరుతో నగలకు ఎసరు..! పెళ్లి కూతురును మోసం చేసే ప్రయత్నం..!!

మార్చి 24న హైదరాబాద్‌కు వచ్చిన మురుగేశన్‌ దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబాగుడి వద్ద ఆమెను కలిశాడు. ఇరువురూ పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. వీలైనంత తొందరలో పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి తెచ్చాడు. విడాకులకు చెందిన పత్రాలు అందాల్సి ఉండటంతో ఆమె వాయిదా వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి 30న నగరానికి చేరుకున్న మురుగేశన్‌ పెళ్లి విషయాలు మాట్లాడుకుందామంటూ ఆమె ఇంటికి వచ్చాడు.

 తమిళ తంబి అతి తెలివి..! చాకచక్యంగా వ్యవహరించిన మహిళ..!!

తమిళ తంబి అతి తెలివి..! చాకచక్యంగా వ్యవహరించిన మహిళ..!!

తమ కుటుంబ జ్యోతిషుడు సూచించాడంటూ ఓ పసుపుతాడు ఆమె చేతికి కట్టాడు. మొదటి భర్త కట్టిన బంగారు తాళిని తొలగించాలని ఒత్తిడి చేశాడు. తాను తెచ్చిన నకిలీ బంగారు హారాన్ని ఆమె మెడలో వేశాడు. ఆమె చేతి బంగారు గాజులూ తీయించాడు. వాటిని ఆమె టేబుల్‌పై పెట్టగా ముఖం కడుక్కుని రావాలంటూ లోనికి పంపించాడు. అదనుచూసి ఆ నగలతో ఉడాయించాడు.

తాట తీసిని పోలీసులు...! ఊచలు లెక్కపెడుతున్న మురుగేషన్..!!

తాట తీసిని పోలీసులు...! ఊచలు లెక్కపెడుతున్న మురుగేషన్..!!

దీంతో ఘొల్లుమన్న బాధితురాలు ఎల్బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుంతకల్లు మీదుగా కోయంబత్తూరుకు వెళ్లిన నిందితుడ్ని క్రైం పోలీసులు వెంబడించారు. అతడి స్వస్థలానికి వెళ్లి అరెస్టుచేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్‌ వారెంటుపై నగరానికి తెచ్చారు. నిందితుడి వద్ద నగలు, ఓ ఐప్యాడ్‌, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. సమాజంలో ఇలాంటి దొంగలు కూడా ఉంటారా అనే ఆలోచన కలిగిస్తున్న యెదవల పట్ల పెళ్లి చేసుకోబోయే యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

English summary
a widow tried to 2nd marriage than she approched a marriaga buereo.Coimbatore's forty seven-year-old Yuvraj Murugesan sent his proposal to her. Murugesan, a scrap businessman, believes he has big business in Chennai and Bangalore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X