వశపరుచుకుని వివాహిత కిడ్నాప్: రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని బెదిరింపు

హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ వివాహిత మహిళను దుండగులు అపహరించుకు వెళ్లారు. ఆ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. గత సోమవారం గుడికి వెళ్తుండగా ఆమెను అపహరించుకుపోయినట్లు చెబుతున్నారు. అయితే, మాయమాటలు చెప్పి ఓ యువకుడు ఆమెను తీసికుని వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత కిడ్నాప్ చేశామని బెదిరిస్తున్నాడని, మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.

తెలిసిన వ్యక్తే ఆమెను తీసుకుని వెళ్లాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళ భర్తకు అతను ఫోన్, వాట్సప్‌ల ద్వారా అతనితో పాటు మరి కొంత మందితో కూడిన దుండగులు బెదిరింపులకు దిగుతున్నారు. రూ.3 లక్షల రూపాయలు ఇవ్వకుంటే నీ భార్యను ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని హెచ్చరించారు.

Married woman kidnapped from Hyderabad

తమ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయాలని వారు డిమాండ్ చేశారు. వాట్సప్ ద్వారా మహిళ ఫొటోను భర్తకు పంపించినట్లు తెలుస్తోంది. దుండగులు తనకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కొడుతున్నారని బాధితారులు ఫోన్ ద్వారా భర్తకు తెలిపింది. మరో వైపు పోలీసులు రంగంలోకి దిగారు.

వాట్సప్ నెంబర్‌ను బట్టి దుండగులు ఒడిశాలో ఉన్నట్లు గుర్తించారు. పరిచయస్థులే ఈ అపహరణకు దిగారని భావిస్తున్నారు. కిడ్నాప‌ర్‌ను త్వరలోనే పట్టుకుంటామని శంషాబాద్ డిసిపి అంటున్నారు. అతన్ని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివాహితను ముందుగానే వశపరుచుకుని కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు.

కాగా, మరో కథనం కూడా వినిపిస్తోంది. ఆమె తన ఇష్టప్రకారమే దుండగులతో కలిసి వెళ్లిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ తర్వాత డబ్బులు లేకపోవడం వల్లనో, ఆమెను వారు మోసం చేయడం వల్లనో ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+