పిన్నిపై అత్యాచారం: నిందలు వేశారని బాధితురాలిపై దాడి
సూర్యాపేట: తల్లి తర్వాతి తల్లి అని భావించే పిన్నిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకొంది. తనకు జరిగిన అన్యాయాన్ని నిందితుడి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్తే అనవసరంగా నిందలు వేస్తారా అంటూ బాధితురాలిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ కరువైంది. వావి వరుసలు కూడ మరిచిపోయి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటన సూర్యాపేటలో చోటు చేసుకొంది.
సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం రాజునాయక్ తండాలో ఈ దారుణం చోటు చేసుకొంది. బాధితురాలిని బంధించి మరీ ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

పిన్నిపై అత్యాచారం
సూర్యాపేట మండలం రాజునాయక్ తండాకు చెందిన వివాహిత భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత కూలీ పనులు చేసుకొంటూ పిల్లలను పోషించుకొంటుంది. అయితే భర్త తరపున బంధువులైన కుటుంబంలో శ్రీకాంత్ వివాహితపై కన్నేశాడు. అయితే శ్రీకాంత్‌కు వివాహిత పిన్ని వరుస అవుతోంది. అయితే వావి వరసులు మరిచిపోయి నిందితుడు శ్రీకాంత్ వివాహితపై ఏప్రిల్ 22 రాత్రిన అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నోట్లో చీర కుక్కి అత్యాచారం
పిన్ని వరుసయ్యే వివాహితపై కన్నేసిన శ్రీకాంత్ ఆదివారం రాత్రి పూట బాధితురాలి ఇంటికి వెళ్ళి బలవంతంగా నోట్లో చీరకుక్కి తీవ్రంగా కొట్టాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. స్పృహతప్పిన తనను ఆరుబయటకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. అయితే మేలుకువ వచ్చి తాను కేకలు వేస్తే నోరు నొక్కి కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

ప్రాధేయ పడ్డ వినలేదు
అయితే తాను వరుసకు తల్లిని అవుతానని నిందితుడికి చెప్పి ప్రాధేయపడినా వినలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై ఎవరికైనా చెబితే తన ముగ్గురు పిల్లలను చంపేస్తామని బెదిరించాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

బాధితురాలిపై నిందితుల దాడి
బాధితురాలు ఈ విషయమై నిందితుడి కుటుంబసభ్యులకు విషయం తెలిపింది. అయితే అనవసరంగా తమ కుటుంబానికి చెందిన శ్రీకాంత్‌పై నిందలు మోపుతారా అంటూ తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications